Narendra Modi: ఆ రెడ్ డైరీలోనే అన్ని రహస్యాలు ఉన్నాయ్!
Rajasthan: ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) కాంగ్రెస్‌పై మరోసారి సెటైర్లు వేసారు. రాజస్థాన్‌లోని (rajasthan) సికార్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ UPA నుంచి INDIAగా పేరు మార్చుకుంది తమ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే అని ఆరోపించారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో (lok sabha elections) BJPని ఓడించేందుకు కాంగ్రెస్ (congress) ఇతర 26 పార్టీలతో కలిసి ఓ కూటమిని ఏర్పాటుచేసుకుంది. దానికి I-N-D-I-A అని పేరు పెట్టింది. దీనిపై మోదీ సెటైర్లు విసిరారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ (ashok gehlot) గురించి మాట్లాడుతూ.. “” ఆ రెడ్ డైరీలోనే సీఎంగారి సీక్రెట్స్ ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించేది ఆ రెడ్ డైరీనే. కాంగ్రెస్ చెప్పే అబద్ధాలకు ఆ రెడ్ డైరీనే సాక్ష్యం. పార్టీకి సంబంధించిన అన్ని రహస్యాలు అదే డైరీలో ఉన్నాయి. రాజస్థాన్‌లో అభివృద్ధి పనులు జరగకుండా కాంగ్రెస్ అడ్డుకుంటోంది. ఈరోజు రాజస్థాన్‌లో కమలం రావాలి.. కమలం వికసించాలి అనే నినాదం మాత్రమే వినిపిస్తోంది. రాజస్థాన్ ప్రజలు నీటి కోసం చావాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. కానీ ఈసారి అలా జరగకుండా చూసే బాధ్యత కమలానిదే “” అని తెలిపారు మోదీ. (narendra modi)
అసలు ఈ రెడ్ డైరీ ఏంటి?
కొన్ని రోజుల క్రితం రాజస్థాన్ మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర గుదా (rajendra gudha) దేశంలో మహిళలపై అత్యధిక దాడులు జరుగుతున్న రాష్ట్రం రాజస్థాన్ అని అన్నారు. దాంతో ఆయన్ను అసెంబ్లీ నుంచి బయటికి తోసేసారు. దాంతో ఆయన మీడియా ముందుకు వచ్చి.. ఓసారి తాను అశోక్ గెహ్లోత్‌ను పెద్ద రైడ్ నుంచి కాపాడానని, అలాంటిది తననే అసెంబ్లీ నుంచి పంపించేసారని అన్నారు. అప్పుడే ఆయన నోటి నుంచి రెడ్ డైరీ అనే మాట వినపడింది.
“” ఓసారి ముఖ్యమంత్రి చెప్పారని కాంగ్రెస్ నేత ధర్మేంద్ర రాథోడ్‌పై ఈడీ చేత దాడులు చేయించాను. దాడుల సమయంలో రాథోడ్ దగ్గర ఉన్న రెడ్ డైరీని తీసి దాచమని సీఎం చెప్పారు. ఏం జరిగినా ఆ డైరీని ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరి చేతికి చిక్కకూడదు అని చెప్పారు. ఆ తర్వాత ఆ డైరీని తగలబెట్టాలని చెప్పారు. నేను అలాగే చేసాను. ఇప్పుడు రాజస్థాన్‌లోనే మహిళలపై ఎక్కువ అకృత్యాలు జరుగుతున్నాయి అని నిజం చెప్పినందుకు నన్ను బయటికి గెంటేసారు. దీని బదులు రాజీనామా చేసేయ్ అని సీఎం ఒక నోటీసు పంపి ఉంటే హ్యాపీగా రిజైన్ చేసేవాడిని “” అని రాజేంద్ర గుదా తెలిపారు. అప్పటి నుంచి BJP రెడ్ డైరీని కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వాడుతోంది. (narendra modi)