Narendra Modi Kurta Price: మోదీ ఎక్కడ షాపింగ్ చేస్తారో తెలుసా?
Narendra Modi Kurta Price: భారత ప్రధాని నరేంద్ర మోదీ ధరించే కుర్తాలు ట్రెండ్ సెట్టర్‌గా మారాయి. ఈరోజు మోదీ 74వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆయన దుస్తుల గురించి తెలుసుకుందాం.
మోదీ కుర్తా పైజామాలు మాత్రమే కాకుండా ఫార్మల్ సూట్స్, క్యాజువల్ దుస్తులు కూడా వేసుకుంటారు. ఇక మోదీ పెట్టుకున్న సన్‌గ్లాసెస్ మేయ్‌బ్యాక్ బ్రాండ్‌కి చెందినవి. దీని ధర రూ.1.5 లక్షలు. ఆయన వాడే పెన్ను మోంట్‌బ్లాంక్ కంపెనీది. ఈ పెన్ను ఖరీదు రూ.1.30 లక్షలు ఉంటుంది. మోదీ వేసుకున్న కుర్తాపై ఆయన పేరును కుట్టించి ఓసారి వేలం వేస్తే ఏకంగా రూ.4.31 కోట్లకు అమ్ముడుపోయింది. ఆ డబ్బును స్వచ్ఛ భారత్ మిషన్‌కు విరాళంగా ఇచ్చారు.
ఇక మోదీ వేసుకున్న దుస్తులన్నీ కూడా అహ్మదాబాద్‌కి చెందిన Z బ్లూ అనే కంపెనీ తయారుచేస్తుంది. ఈ కంపెనీ తయారుచేసే అన్ని దుస్తులను మోదీ డబ్బులు ఇచ్చి స్వయంగా కొనుగోలు చేస్తుంటారు.