Narendra Modi: 2047 ఎన్నికలపై ఫోకస్ చేయండి
Delhi: 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో (lok sabha elections) కాకుండా 2047లో జరగబోయే ఎన్నికలపై ఫోకస్ చేయాలని పార్టీ వర్గాలకు పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi). 2024 ఎన్నికలని మాత్రమే దృష్టిలో పెట్టుకుంటే దేశవ్యాప్తంగా తీసుకురావాలనుకున్న మార్పును తేలేమని, అదే 2047 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తే అభివృద్ధి బాగుంటుందని అన్నారు. అప్పటికి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తవుతుంది కాబట్టి మరింత ప్రత్యేకంగా ఉంటుందని తెలిపారు. దిల్లీలోని ప్రగతి మైదాన్ కన్వెంక్షన్ సెంటర్‌లో కేంద్రమంత్రులతో సమావేశాన్ని ఏర్పాటుచేసారు మోదీ. 2047 అనేది భారతదేశానికి అమృత కాలమని, రానున్న 25 ఏళ్లల్లో ఏంతో చేయొచ్చని మోదీ తెలిపారు. మీటింగ్‌లో పాల్గొన్న వివిధ మంత్రులు రానున్న 25 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి చేయొచ్చే మోదీకి ప్రజెంటేషన్ ద్వారా చూపించారు.
లోక్‌సభ ఎన్నికలకు ఇంకా 9 నెలల సమయం ఉంది కాబట్టి.. ఈ 9 ఏళ్లల్లో కేంద్రం దేశానికి చేసిన మంచి గురించి చెప్తూ ఉండాలని మంత్రులకు పిలుపునిచ్చారు. వివిధ మంత్రిత్వ శాఖలు చేసిన పనుల్లో మేజర్‌వి తీసుకుని ఓ క్యాలెండర్‌ను రూపొందించాలని ఆదేశాలు జారీ చేసారు. కేబినెట్‌లో మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో మోదీ ఈ సమావేశం ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది.