Modi: KCR NDAలో చేరతానని నా దగ్గరికి వచ్చారు
తెలంగాణ ఎన్నికల (telangana elections) నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ (modi) నిజామాబాద్‌లో (nizamabad) పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్‌లో విద్యుత్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసింది తానే అని.. ఈరోజు తానే స్వయంగా వచ్చి ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తున్నానని తెలిపారు.
“” గుజరాత్ బిడ్డ సర్దార్ వల్లభాయ్ పటేల్‌తో దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అయినా తెలంగాణకు స్వేచ్ఛ మాత్రం రాలేదు. ఇప్పుడు ఈ గుజరాతీ బిడ్డ మీకోసం కృషి చేయబోతున్నాడు. మీ భవిష్యత్తు కోసం మేం KCR సర్కార్‌కు ఎన్ని కోట్ల నిధులు కేటాయించినా ఒక్క రూపాయి కూడా ప్రజలకు వాడకుండా వారే తినేసారు. ఇప్పుడు నిజామాబాద్‌లో కొత్త రైళ్లు, రహదారులు, హాస్పిటల్స్ కట్టిస్తున్నాం. BRS ప్రజాతంత్రాన్ని.. పరివార తంత్రంగా మార్చేసింది. తెలంగాణ కోసం వేల కుటుంబాలు త్యాగం చేసాయి.
యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తల్లిదండ్రులు తమ బిడ్డలను కోల్పోయి ఎంతో కుమిలిపోయారు. కానీ ఒక్క కుటుంబం మాత్రం లాభపడింది. తెలంగాణ వచ్చాక ఒక్క కుటుంబం ఇక్కడి లక్షల కుటుంబాలను దోచేసుకుంది. తెలంగాణ వాసులు కాంగ్రెస్ విషయంలో కూడా జాగ్రత్త పడాలి. BRS కాంగ్రెస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయి. రానున్న ఎన్నికల్లో BRS ఓడిపోవడం ఖాయం. కర్ణాటక ఎన్నికల్లో BRS.. కాంగ్రెస్‌కు బాగా సాయం చేసింది. తెలంగాణ వాసుల నుంచి దోచుకున్నదంతా కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పంచిపెట్టారు. (modi)
హైదరాబాద్ మున్సిలప్ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత KCR నన్ను కలవడానికి ఢిల్లీకి వచ్చాడు. NDAలో చోటు కావాలని అడిగాడు. నేను కుదరదు అని చెప్పాను. నా కొడుక్కి పదవి ఇవ్వాలని అడిగారు. అప్పుడు నేను ఒక్కటే మాట అనుకున్నారు. నువ్వేమన్నా మహారాజువా నీ తర్వాత నీ కొడుకు రాజ్యం ఏలడానికి అని ముఖం మీదే చెప్పాను. కావాలంటే జర్నలిస్ట్‌లు ఈ విషయంపై విచారణ కూడా చేసుకోండి. మీకే తెలుస్తుంది. ఎవరికి అధికారం ఇవ్వాలనేది తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారని చెప్పాను.
ఆ రోజు తర్వాత నుంచి KCR నా కళ్లల్లోకి చూసి మాట్లాడలేకపోతున్నారు. నా నీడను చూడటానికి భయపడుతున్నాడు. నాపై నమ్మకం ఉంచి గెలిపిస్తే మీ నుంచి BRS దోచుకున్నదంతా మీ పాదాల ముందు ఉంచుతాను. కాంగ్రెస్ వాళ్లు చెప్పే తప్పుడు హామీలు నమ్మకండి. జాబ్ మేళా ద్వారా యువతకు అనేక ఉద్యోగాలు ఇచ్చాం. నేను గ్యారెంటీ ఇస్తే నెరవేర్చి తీరుతాను. రైతుల కోసం ఇచ్చిన రుణమాఫీని BRS తుంగలో తొక్కంది. మీకు సేవ చేసుకునే భాగ్యం నాకు కల్పించండి. “” అంటూ తీవ్రంగా తెలంగాణ సర్కార్‌పై విరుచుకు పడ్డారు ప్రధాని. (modi)