Nara Lokesh: రామ్ గోపాల్ వర్మ “వ్యూహానికి” లోకేష్ ఝలక్
Nara Lokesh: రామ్ గోపాల్ వర్మ (ram gopal varma) డైరెక్ట్ చేసిన వ్యూహం (vyooham) సినిమాపై తెలంగాణ హైకోర్టులో నారా లోకేష్ రిట్ పిటిషన్ వేసారు. తమపై ఉద్దేశపూర్వకంగా బురద జల్లి YSRCPకి ఎన్నికలలో లబ్ధి చేకూర్చేందుకే ఈ సినిమాను తీసారని దీనికి సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ను స్వీకరించిన హైకోర్టు ఈ నెల 26న విచారణ చేపట్టనుంది.