AP Elections: పవన్‌ను ఇప్పటినుంచే పక్కన పెడుతున్నారా?
AP Elections: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన (janasena) తెలుగు దేశం పార్టీ (TDP) కలిసే పోటీ చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయి అనే దానిని బట్టి ముఖ్యమంత్రి అభ్యర్ధిని ఎన్నుకునే అవకాశం ఉంటుందని ముందు నుంచీ జనసేనాని పవన్ కళ్యాణ్ (pawan kalyan) అంటున్నారు. ఆయన ఎక్కడా కూడా తన సీఎం పదవి వద్దని కానీ చంద్రబాబే (chandrababu naidu) సీఎం అని కానీ చెప్పలేదు. కానీ ఈరోజు నారా లోకేష్ (nara lokesh) చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఇప్పటినుంచే తెలుగు దేశం పార్టీ పవన్ కళ్యాణ్‌ను పక్కన పెట్టాలని చూస్తోందని క్లియర్‌గా తెలుస్తోంది.
ఏపీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ, జనసేన గెలిస్తే మళ్లీ సీఎం చంద్రబాబు నాయుడే అవుతారని ఎందుకంటే ఆయనకు ఎక్కువ అనుభవం ఉందని నారా లోకేష్ అన్నారు. కనీసం మాటవరుసకైనా ఏ పార్టీ ఎన్ని సీట్లు వస్తుందో చూసి అప్పుడు జనసేనతో సంప్రదింపులు జరిపి సీఎం అభ్యర్ధిపై నిర్ణయం తీసుకుంటామని కూడా లోకేష్ అనకపోవడం జనసేన నేతల్లో ఆందోళన కలిగిస్తోంది. చూడబోతే ఎన్నికల తర్వాత ఒకవేళ గెలిస్తే ఎక్కడ జనసేన పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చి పవన్ సీఎం పదవి అడుగుతారోనని ఇప్పటినుంచే పవన్‌ను పక్కనపెట్టేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అదే ఒకవేళ పవన్ కానీ మనోహర్ కానీ గెలిస్తే సీఎం పదవి తీసుకోవాలని ఉంది అని ఉంటే.. తెలుగు దేశం పార్టీ రియాక్షన్ ఎలా ఉండేదో తెలిసిందే. లోకేష్ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఏమంటారో వేచి చూడాలి.