Nara Lokesh: నేను తప్పు చేస్తే నాన్న ఎప్పుడో నన్ను జైలుకి పంపేవారు
నేను తప్పు చేసి ఉంటే నాన్న నన్ను ఎప్పుడో జైలుకి పంపేవారని అన్నారు నారా లోకేష్ (nara lokesh). ఈరోజు లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణిలు.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న చంద్రబాబు నాయుడుతో (chandrababu naidu) ములాఖత్ అయ్యారు. అనంతరం నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు.
“” పిచ్చి జగన్ పచ్చ జెండాను చూస్తుంటే భయపడిపోతున్నాడు. అందుకే ఈ తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. కక్ష సాధింపు చర్యల వల్ల ఏపీకి రావాల్సిన పరిశ్రమలు, కంపెనీలు పక్క రాష్ట్రానికి వెళ్లిపోతున్నాయి. న్యాయం ఆలస్యం కావచ్చేమో కానీ ధర్మం మా వైపే ఉంది. చంద్రబాబు నాయుడు జగన్ కంటే ఎక్కువ స్ట్రాంగ్‌గా ఉంటారు. జగన్ కంటే ఫాస్ట్‌గా తిరుమల కొండ ఎక్కగలరు. కానీ జైలులో నక్సలైట్లు, గంజాయి ముఠాలు ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఎవర్ని ఎదిరించారో వారంతా అదే జైలులో ఉన్నారు. దాంతో ఆయన భద్రతపై మాకు కాస్త భయంగా ఉంది. ఒక వ్యక్తి జైలులోకి అడుగుపెడితే అక్కడి ఫోటోలు, వీడియోలు బయటికి రాకూడదు. కానీ అవి ఎలా వచ్చాయి? దీనికి అధికార ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతోంది. ఆనాడు జగన్ పాదయాత్ర చేయాలనుకున్నప్పుడు మా నాన్న ఒక్క చిటిక వేసి ఉంటే పాదయాత్ర చేయగలిగేవాడా? కానీ మేం అలాంటి చర్యలకు పాల్పడం. చంద్రబాబు తప్పు చేసే వ్యక్తి కాదు. మా పార్టీ అవినీతి పార్టీ కాదు. “” అని తెలిపారు