Nara Lokesh: అమ్మ ఒడికి పోటీగా త‌ల్లికి వంద‌నం

AP: అధికార ప్ర‌భుత్వం YSRCP 2020లో ఈ అమ్మ ఒడి (amma vodi) ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. దీని ద్వారా పేద త‌ల్లులు త‌మ బిడ్డ‌ల‌ను స్కూళ్ల‌కు పంపితే సంవ‌త్స‌రానికి రూ.15,000 ఇస్తారు. ఇప్పుడు ఇలాంటి ప‌థ‌కాన్నే TDP ప్ర‌వేశ‌పెట్టాల‌నుకుంటోంది. దీనికి త‌ల్లికి వంద‌నం (thalliki vandanam) అనే పేరు కూడా పెట్టారు. ఈ ప‌థ‌కం ద్వారా ఇంట్లో ఎంత మంది బిడ్డలు ఉంటే వారికి సంవత్సరానికి 15 వేల రూపాయల చొప్పున ఇస్తామ‌ని నారా లోకేష్ (nara lokesh) యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో  (yuvagalam padayatra) ప్ర‌క‌టించారు. ఒక బిడ్డ ఉంటే రూ.15,000, ఇద్దరు ఉంటే రూ.30000, ముగ్గురు ఉంటే రూ.45000ల చొప్పున నేరుగా బిడ్డ త‌ల్లి అకౌంట్‌లో వేస్తామ‌ని దీని ద్వారా పిల్ల‌ల్ని చ‌దివించుకోవ‌చ్చ‌ని తెలిపారు.