Nara Lokesh: ఈరోజు బాహుబలి సినిమా చూపించారు
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (amaravathi inner ring road) స్కాంలో భాగంగా నారా లోకేష్‌ను (nara lokesh) AP CID రెండో రోజు విచారణ చేసింది. ఈ నేపథ్యంలో లోకేష్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఎలాంటి కొత్త ప్రశ్నలు అడగలేదని.. ఒక రెండు కొత్త ప్రశ్నలను తప్ప నిన్న అడిగినవే మళ్లీ అడిగారని అన్నారు.
“”” రెండో రోజు విచారణలో నాకు ఈరోజు కొత్తగా AP CID అధికారులు బాహుబలి సినిమా చూపించారు. నాకు ఒక గూగుల్ ఎర్త్ లాంటిది ఏదో చూపించి అందులో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ ఎలా జరిగింది అని ప్రశ్నలు అడిగారు. నాకు ఆ గూగుల్ ఎర్త్ చూసిన తర్వాత అర్థం అయ్యిందేంటంటే.. ఇన్నర్ రింగ్ రోడ్డు హెరిటేజ్ భూముల్లో నుంచి కనిపించింది. అంటే మా హెరిటేజ్ భూములే ఇన్నర్ రింగ్ రోడ్డులో పోయాయని నాకు అర్థమైంది. మా అమ్మ ఐటీ రిటర్న్స్ డాక్యుమెంట్స్ కూడా చూపించారు. అసలు మా అమ్మకు ఎలాంటి జీతం రాదు. అలాంటప్పుడు ఐటీ రిటర్న్స్ ఎక్కడి నుంచి వస్తాయి. ఈ విషయాన్ని నేను కాస్త సీరియస్‌గా తీసుకోవాలని అనుకుంటున్నాను “” అని తెలిపారు.