Nara Lokesh: తెలంగాణలో జనసేనతో పొత్తు లేదు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (telangana elections) మాత్రం జనసేనతో (janasena) పొత్తు లేకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని తెలిపారు జనరల్ సెక్రటరీ నారా లోకేష్ (nara lokesh). ఏపీలో పొత్తు పెట్టుకుంటున్నామంటే అందుకు కారణం YSRCPకి వ్యతిరేకంగా ఉన్నవారితో కలిసి పోరాడాలనే ఉద్దేశంతో మాత్రమేనని తెలిపారు.
“” జగన్‌కి ఉన్న ఏకైక స్ట్రాంగ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు. అందుకే ఎన్నికల్లో గెలిచాక ప్రజలకు మంచి చేయాల్సిందిపోయి చంద్రబాబు చేసిన మంచిని పూర్తిగా తుడిచిపెట్టేయాలనుకున్నాడు. మా నాన్నపై తప్పుడు కేసు పెట్టాడనడానికి నా దగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయి. నేను జగన్‌తో డిబేట్‌లో కూర్చోవడానికి రెడీ. ఆయనకు ఆ దమ్ముందా? 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిపై తప్పుడు కేసులు పెడితే ఇక సామాన్య ప్రజల సంగతి ఏంటి? జగన్ పాలన నచ్చనివారు ఎవరైనా సరే మాతో కలవండి. కలిసే అతన్ని ఏపీ నుంచి గెంటుదాం. అసలు వేరే రాష్ట్రాలకు వెళ్లి ప్రెస్ మీట్లు పెట్టాల్సింది రాజకీయ నేతలు. కానీ ఏపీలో మాత్రం సీఐడి, ఏసీబీ వారు కలిసి ఇష్టమొచ్చినట్లు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. మాకు ఈ అరెస్ట్ స్పీడ్ బ్రేకర్ లాంటిదే. ధైర్యంగా పోరాడతాం. అన్ని సీట్లు గెలుస్తాం అని మండిపడ్డారు “” నారా లోకేష్. (nara lokesh)