Nara Lokesh: నో బ్రేక్.. కోర్టుకి వెళ్లేపని లేదుగా!
AP: TDP జాతీయ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ (nara lokesh) యువగళం పాదయాత్రతో (yuvagalam) బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మొన్న జులై 11 నాటికి 2000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన లోకేష్.. 400 రోజుల్లో 4000 కిలోమీటర్ల పాదయాత్ర అనేది అంత ఈజీ కాదని అంటున్నారు.
“” YSRCP అరాచక పాలన చూసాక ఎంత కష్టమైనా పాదయాత్ర చేయాలి అనిపించింది. అందుకే నాన్న నియోజకవర్గం అయిన కుప్పం నుంచి మొదలుపెట్టాను. ఇచ్ఛాపురంలో నా పాదయాత్ర పూర్తవుతుంది. ఈ పాదయాత్రకు యువగళం అని పేరు పెట్టేముందు చాలా రీసెర్చ్ చేసాం. ఏపీలో యువత ఎక్కువగా ఉన్నారు. పాపం ఇప్పుడున్న ప్రభుత్వం వారి జీవితాలతో ఆడుకుంటోంది. అందుకే యువత సమస్యలు తెలుసుకోవాలని వారికి బెటర్ పరిపాలనను అందించాలన్న ఉద్దేశంతో యువగళం అని పేరుపెట్టాం. ఈ యువతను కలుపుకుంటూపోయాను కాబట్టే వారి సమస్యలు దగ్గరుండి తెలుసుకున్నాను కాబట్టే మూడు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల నుంచి గెలిచాం “” (nara lokesh)
“” ఈ పాదయాత్ర చేస్తున్న సమయంలో నాకు సంతోషకరమైన, బాధాకరమైన అనుభవాలు ఎదురయ్యాయి. ముందు బాధాకరమైనవి చెప్తాను. చిత్తూరుకి చెందిన ఓ మహిళ నా దగ్గరికి వచ్చి తన బిడ్డ చదువుతున్న కాలేజ్‌లో YSRCP యాక్టివిస్ట్‌లు డ్రగ్స్ అలవాటుచేసారని మొరపెట్టుకుంది. నాకు చాలా బాధేసింది. వెంటనే ఆ అమ్మాయిని డీ ఎడిక్షన్ సెంటర్‌లో జాయిన్ చేయించాను. ఆ తర్వాత శ్రీకాళహస్తికి చెందిన వెనకబడిన కులానికి చెందిన ఒకావిడ నా దగ్గరికి వచ్చి తన బాధలు చెప్పుకుంది. ఓ YSRCP ఎమ్మెల్యే ఆమె పెట్టుకున్న టిఫిన్ సెంటర్‌ను కూలగొట్టించారట. ఎమ్మెల్యే తన బూటు నాకితే కానీ మళ్లీ టిఫిన్ సెంటర్ పెట్టుకోనివ్వం అన్నారట. మేం అధికారంలోకి వస్తే ఇలాంటి వారిని అస్సలు వదిలిపెట్టం “” (nara lokesh)
“” జగన్ రెడ్డి పాలనలో అన్ని కులాలు, వర్గాలకు చెందినవారు ఏదో ఒక రకంగా హింసించబడ్డారు. 2019 ఎన్నికల సమయంలో కొన్ని వర్గాలకు చెందిన ఓటర్లు టీడీపీకి దూరంగా ఉన్నారన్నది తెలుసు. జగన్ ఒక్క ఛాన్స్ అని చెప్పడంతో తమకు ఏదైనా చేస్తారని నమ్మి ఓటేసారు. ఇప్పుడు అందుకు బాధపడుతున్నారు. మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే తమకు మంచి రోజులు వస్తాయని అంటున్నారు “” (nara lokesh)
“” పాదయాత్ర చేయడం అంత సులువు కాదు. నడకతో పాటు మధ్యలో కొన్ని ప్రాంతాలకు చెందిన యువతతో మీటింగ్స్ ఏర్పాటుచేస్తున్నాం. వారి కష్టాలేంటో ఏపీ నుంచి ఏం కావాలని కోరుకుంటున్నారో తెలుసుకోవడానికి ఈ మీటింగ్స్ మాకు బాగా ఉపయోగపడతాయి. నేను రోజూ ఎక్సర్‌సైజ్ చేస్తూ మంచి ఫుడ్ తీసుకుంటాను కాబట్టే ఇన్ని కిలోమీటర్లు నడవగలుగుతున్నాను. నాకు వీకాఫ్స్ అనేవి ఏమీ ఉండవు. నేను ఆదివారాలు కూడా పాదయాత్రలో పాల్గొంటాను. మధ్యలో సెలవులు పెట్టి కోర్టుకు వెళ్లడానికి జగన్‌లాగా నాపై కేసులు లేవు కదా. నేను నా పాదయాత్రలో భాగంగా ఇప్పటివరకు మూడు సార్లు మాత్రమే బ్రేక్ తీసుకున్నాను. మా కజిన్ తారక రత్న చనిపోయినప్పుడు ఒకసారి, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలప్పుడు, మహానాడు ఈవెంట్ జరిగినప్పుడు మాత్రమే సెలవులు పెట్టాను “” అంటూ తన పాదయాత్ర విశేషాలను పంచుకున్నారు నారా లోకేష్ (nara lokesh)