Nara Lokesh: ఏపీలోనూ మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం..!
Nara Lokesh: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సర్వీసు పథకాన్ని ఏపీలోనూ అమలు చేయనున్నారు. 2024లో జరగబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ (TDP) అధికారంలోకి వస్తే ఆ బస్సు సర్వీస్ ఏపీలోనూ ఉంటుందని నారా లోకేష్ హామీ ఇచ్చారు. మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు వ్యాపారాలను ప్రారంభించాలనుకునేవారికి పెట్టుబడులు కూడా ఇస్తామని లోకేష్ పాయకరావు పేట నియోజకవర్గంలో తెలిపారు. జగన్ ప్రభుత్వం దిశా యాప్ పేరుతో అక్రమాలకు పాల్పడుతోందని అసలు ఆ యాప్ ఏపీలో అమల్లో లేదని అన్నారు. TDP ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహాశక్తి పథకం పేరుతో మహిళలకు రక్షణ కల్పిస్తామని.. మహిళల సమస్యలన్నీ తీరుస్తామని హామీ ఇచ్చారు.