Nara Lokesh: నీ కారు రిపేర్ చేయించే బాధ్య‌త నాది

nara lokesh promises car dent repair

Nara Lokesh: నీ కారు రిపేర్ చేయించే బాధ్య‌త నాది అంటూ ఓ నెటిజ‌న్‌కు హామీ ఇచ్చారు తెలుగు దేశం పార్టీ నేత నారా లోకేష్‌.  క‌ళ్యాణ్ అనే నెటిజన్ నారా లోకేష్ కాన్వాయ్ వ‌ల్ల త‌న కారుకి డెంట్ ప‌డిందంటూ ట్విటర్‌లో ఫోటోలు పోస్ట్ చేసాడు. “” స‌ర్ లోకేష్ గారూ.. మీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. విశాఖప‌ట్నం తాటిచ‌ట్ల‌పాలెం హైవే వ‌ద్ద మీ కాన్వాయ్ వెళ్తోంది అంటే నేను ఇత‌ర వాహ‌నాల‌తో పాటు నా కారును కూడా ప‌క్క‌కు ఆపుకున్నాను. ఆ స‌మ‌యంలో మీ కాన్వాయ్‌లోని ఓ వాహ‌నం నా కారు డోర్‌కి త‌గిలి ఇలా డెంట్ ప‌డింది “” అని వెల్ల‌డించాడు.

దీనిపై లోకేష్ స్పందించారు. “” నా కాన్వాయ్ డ్రైవ‌ర్ త‌ర‌ఫున నేను సారీ చెప్తున్నా క‌ళ్యాణ్ గారూ. నా భ‌ద్ర‌తా సిబ్బందికి ముందు ముందు ఇలాంటి సంఘ‌ట‌న‌లు ఎదురుకాకుండా చూసుకోవాల‌ని చెప్తాను. నా టీం మిమ్మ‌ల్ని క‌లిసి మీ కారును ద‌గ్గరుండి రిపేర్ చేయిస్తుంది “” అని హామీ ఇచ్చారు.