Nara Lokesh: ఒకే డాక్ట‌ర్ రెండు వేర్వేరు రిపోర్టులు ఇచ్చారు

జైల్లో ఉన్న TDP అధినేత చంద్ర‌బాబు నాయుడుతో (chandrababu naidu) ఈరోజు నారా లోకేష్ (nara lokesh) ములాఖాత్ అయ్యారు. అనంత‌రం మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేట్ ఛైర్మ‌న్ అజయ్ రెడ్డి అన్ని సెంట‌ర్లు న‌డుస్తున్నాయ్.. ఎక్క‌డా ఒక్క సెంట‌ర్ మూయ‌లేదు అని చెప్పారు. చంద్ర‌బాబు ఏ త‌ప్పూ చేయ‌లేదు.

“” మీకు ద‌మ్ము ఉంటే ఆధారాలు ప్ర‌జ‌ల ముందు పెట్టండి. వ్య‌వ‌స్థ‌ల్ని మేనేజ్ చేసి మాజీ సీఎంగా ఉన్న వ్య‌క్తిని ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌కుండా జైల్లో బందించ‌డం అన్యాయం. మా అమ్మ నిజం గెల‌వాల‌ని ప్ర‌జ‌ల్లోకి వెళ్తే ఆమెను కూడా అరెస్ట్ చేయిస్తామ‌ని బెద‌రిస్తున్నారు. ఇది వ్య‌క్తిగ‌త క‌క్ష సాధింపు కాక‌పోతే ఇంకేంటి? ఈ స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసులో అస‌లు మా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు.

సైకో జ‌గ‌న్ వ్య‌వ‌స్థ‌ల్ని మేనేజ్ చేసి చంద్ర‌బాబు మ‌న స‌మ‌స్య‌లు పోరాడ‌కుండా నిర్భందించారే త‌ప్ప ఆయ‌న ఏ త‌ప్పూ చేయ‌లేదు. ఈరోజు ప్ర‌భుత్వం చంద్రబాబుని జైల్లో పెట్ట‌డానికి ప‌ది కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తోంది. అదే శ్ర‌ద్ధ ల‌క్ష 32 వేల ఎక‌రాల్లో పంట న‌ష్టం జ‌రిగిన‌ప్పుడు ప్ర‌భుత్వం కనీసం ఒక మీటింగ్ పెట్టింది లేదు. బ‌స్సు యాత్ర అని గాలి తిరుగుడు చేస్తున్నారు. ఎందుకు రైతుల కోసం తిర‌గ‌డంలేదు. నిరుద్యోగ స‌మ‌స్య‌లతో యువ‌త బాధ‌ప‌డుతుంటే ప‌ట్టించుకోరు. మొన్న ఆర్టీసీ బ‌స్సు YSRCP నాయ‌కుడికి దారి ఇవ్వ‌లేద‌ని డ్రైవ‌ర్‌ను న‌డి వీధిలో కొట్టారు.

ప్ర‌జ‌లు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా మాట్లాడితే వారిపై కేసులు పెట్టి చ‌నిపోయేలా చేసింది. ద‌ళితుల‌ను చంపేస్తున్నారు. వారు చెప్పిన‌ట్లు చేస్తేనే బ‌తుకుతాం లేదంటే జైలుకే. మేం దీనికి ఒప్పుకోం. ప్ర‌జ‌ల త‌ర‌ఫున పోరాడ‌దాం. ఈ సైకో జ‌గ‌న్‌ను వ‌దిలేదే లేదు. త్వ‌ర‌లో క్వాష్ పిటిష‌న్‌పై జ‌డ్జ్‌మెంట్ రిజ‌ర్వ్‌లో ఉంది. త్వ‌ర‌లో ఆ తీర్పు కూడా వ‌స్తుంది “”  అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు (nara lokesh)