AP CID Report: ఆయన ద్వారానే లోకేష్‌కు డబ్బులు అందాయట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఐడీ (ap cid report) రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటపడ్డాయి. రిమాండ్ రిపోర్టులో నారా లోకేష్ (nara lokesh) పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కిలారు రాజేష్ ద్వారా లోకేష్‌కు డబ్బులు అందాయని ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబుకు (chandrababu naidu) తన వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ ద్వారా ముడుపులు అందాయని ఈ కుంభకోణంపై ఈడీ కూడా విచారణ జరుపుతోందని తెలుస్తోంది. ఈ కేసులో ఈడీ ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో ఈడీ విచారణ కీలక దశలో ఉంది. కేసులో మనోజ్ వాసుదేవ్, పెండ్యాల శ్రీనివాస్‌కు సెప్టెంబర్ 5న నోటీసులు పంపారు. ఆ నోటీసులకు జవాబు ఇవ్వకుండా వారు విదేశాలకు పారిపోయారు. చంద్రబాబును కాపాడేందుకే వారు విదేశాలకు పారిపోయారని వీళ్లను చంద్రబాబే కాపాడుతున్నాడని అనుమానంగా ఉన్నట్లు ఏపీ సీఐడీ అంటోంది. (ap cid report)