Nara Lokesh అరెస్ట్ త‌ప్ప‌దా?

Nara Lokesh: ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో నారా లోకేష్‌కు ఏపీ CID నోటీసులు పంపింది. ఎక్క‌డ ప్ర‌చార చేసినా.. ఎక్క‌డ ప్ర‌స‌గించినా.. ఏ టీవీల‌కైనా ఇంట‌ర్వ్యూలు ఇచ్చినా రెడ్ బుక్‌ను చూపిస్తూ అధికారుల‌ను బెదిరిస్తున్నారు అంటూ CID అధికారులు ACB కోర్టులో పిటిష‌న్ వేసారు. ఈ విష‌యంలో లోకేష్‌కు నోటీసులు పంపేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని కోర‌గా ఇందుకు కోర్టు కూడా ఒప్పుకుంది. ఈ నేప‌థ్యంలో లోకేష్‌కు వాట్సాప్‌లో నోటీసులు పంపారు.

రెడ్ బుక్ అంటే ఏంటి?

నారా లోకేష్ కొంత‌కాలంగా ఓ ఎర్ర అట్ట ఉన్న పుస్తకాన్ని మెయింటైన్ చేస్తున్నారు. ప్ర‌చారాల‌కు ప్ర‌సంగాల‌కు వెళ్లినప్పుడు ఈ రెడ్ బుక్ ప‌ట్టుకుని వెళ్తున్నారు. తెలుగు దేశం పార్టీ నేత‌ల‌పై కార్య‌క‌ర్త‌ల‌పై త‌ప్పుడు కేసులు పెడుతున్న నేత‌లు, వారికి స‌పోర్ట్ చేస్తున్న అధికారులు, పోలీసుల పేర్లు ఆ రెడ్ బుక్‌లో నమోదు చేస్తున్నారు. ఆ బుక్‌లో చాలా పెద్ద లిస్ట్ ఉంద‌ని.. తాము అధికారంలోకి వ‌చ్చాక ఒక్కొక్క‌రి ప‌ని చెప్తాన‌ని బెదిరించారు.

CID నోటీసులు ఎందుకు పంపింది?

అమ‌రావ‌తి ఇన్న‌ర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ కేసులో ఏపీ CID నారా లోకేష్‌ను ఏ14గా పేర్కొంది. అయితే ఆయ‌న ముంద‌స్తు బెయిల్‌కు మంజూరు చేసుకున్న నేప‌థ్యంలో ఎన్నిక‌లు వ‌స్తున్నాయ‌ని ఎక్క‌డా కూడా కేసుల‌కు సంబంధించిన అంశాలు మాట్లాడ‌కూడ‌ద‌ని ఏపీ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ లోకేష్ ఆ రూల్స్ మ‌రిచి ఎక్క‌డ ప‌డితే అక్క‌డ కేసుకు సంబంధించిన అంశాలు మాట్లాడ‌ట‌మే కాకుండా ప‌రోక్షంగా బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నార‌ట‌. ఈ విష‌యాన్ని ఏసీబీ కోర్టులో CID అధికారులు ప్ర‌స్తావించ‌గా నోటీసులు పంపేందుకు కోర్టు ఆదేశించింది.

అరెస్ట్ త‌ప్ప‌దా?

CID నోటీసులు పంపిన నేప‌థ్యంలో అధికారులు చేసే విచార‌ణ‌ను బ‌ట్టి లోకేష్ అరెస్ట్ అవుతారా లేదా అని తెలుస్తుంది. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న బెదిరింపుల‌కు పాల్ప‌డుతుండ‌డంతో లా అండ్ ఆర్డ‌ర్ స‌మ‌స్య‌లు రాకుండా అదుపులోకి తీసుకోవాల‌ని ఏపీ ACB కోర్టు ఆదేశాలు జారీ చేసినా చేయొచ్చు.