Nara Lokesh: అందుకే ఢిల్లీకి వెళ్లాను

చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) ప‌ట్ల జ‌రిగిన అన్యాయం గురించి ప్ర‌జ‌ల‌కు తెలియాల‌నే ఢిల్లీకి వెళ్లాన‌ని తెలిపారు నారా లోకేష్‌ (nara lokesh). జ‌గ‌న్ ప్ర‌భుత్వం కావాల‌నే త‌ప్పుడు కేసులు బ‌నాయించి చంద్ర‌బాబుని జైల్లో పెట్టించింద‌ని తెలిపారు. ఇప్ప‌టివ‌ర‌కు సీఐడి ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జ‌రిగిన‌ట్లు మాత్రం నిరూపించ‌లేక‌పోయిందని అన్నారు. న్యాయం ఆల‌స్యం అవ్వచ్చు కానీ చివ‌ర‌కు న్యాయ‌మే గెలుస్తుంద‌ని తెలిపారు. జాతీయ నేత‌లంతా చంద్ర‌బాబు నాయుడు వైపే ఉన్నార‌ని వెల్ల‌డించారు.