Nara Lokesh: నువ్వు మంచి చేయ‌లేదు.. ముంచేసావ్

nara lokesh counters to jagan comments against him

Nara Lokesh: నువ్వు మంచి చేయ‌లేదు జ‌గ‌న్.. ముంచేసావ్ అని కౌంట‌ర్ వేసారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌. ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో అరెస్ట్ అయిన పిన్నెళ్లి రామ‌కృష్ణారెడ్డిని అరెస్ట్ చేసిన నేప‌థ్యంలో ఈరోజు జ‌గ‌న్ ఆయ‌న్ను క‌లిసి ప‌రామ‌ర్శించారు. ఆ త‌ర్వాత మీడియాతో మాట్లాడుతూ.. త‌ను త‌న పార్టీ మంచి చేస్తే త‌ప్పుడు కేసులు పెట్టి బొక్క‌లో వేస్తున్నార‌ని.. ప్ర‌శ్నిస్తే దాడుల‌కు పాల్ప‌డుతున్నార‌ని అన్నారు. దీనిపై లోకేష్ స్పందిస్తూ.. నువ్వు మంచి చేయ‌లేదు జ‌గ‌న్.. ముంచేసావ్ అని ట్వీట్ చేసారు.