Nara Lokesh: అంబ‌టి రాయుడుని ఎంతిస్తావ్ అని వేధించారు

Nara Lokesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని (Jagan Mohan Reddy) శున‌కంతో పోలుస్తూ షాకింగ్ కామెంట్స్ చేసారు నారా లోకేష్‌ (Nara Lokesh). ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లు (AP Elections) ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో ఆయ‌న శంఖారావం పేరిట ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. ఈరోజు శృంగ‌వ‌ర‌పుకోట‌లో నారా లోకేష్ శంఖారావం కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా నారా లోకేష్ ఈ విధంగా ప్ర‌సంగించారు.

అరగంట అంబటి రాంబాబు చాలా బాధ‌ప‌డుతున్నారు. ఆయ‌న‌ది కుర్చీ కాదు సింహాస‌నం అని ప‌దే ప‌దే చెప్తున్నారు. అవును.. అది సింహాస‌న‌మే. కానీ సింహాస‌నంపై కూర్చుంది ఒక శున‌కం. ఆ శున‌కాన్ని త‌రిమి త‌రిమి కొట్టాల‌ని నేను అంటున్నాను. ఒప్పుకుంటావా అర‌గంట అంబ‌టి? ఎన్నిక‌ల ముందు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి న‌వ‌ర‌త్నాలు అన్నాడు. అది ఇప్పుడ న‌వ‌మోసాలుగా మారింది. ఎన్నిక‌ల ముందు ఎంత మంది బిడ్డ‌లు ఉంటే అంత మందికి అమ్మ ఒడి అన్నాడు. ఇప్పుడు ఇంటికి ఒక్క‌రే అంటున్నారు.

ALSO READ: Nara Lokesh: వారిని అలా అనేస్తే ఎలా లోకేష్ బాబూ…!?

ఎన్నిక‌ల ముందు సంపూర్ణ మ‌ద్య‌పాన నిషేధం చేసిన త‌ర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు వీధి వీధిలో మంద ఏరులైపారుతోంది. 45 ఏళ్లు వ‌చ్చినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మ‌హిళ‌ల‌కు పింఛ‌ను ఇస్తాన‌ని ఇప్పుడు మాట త‌ప్పాడు . మీరు ప‌డుతున్న క‌ష్టాలు చూసిన త‌ర్వాత చంద్ర‌బాబు నాయుడు సూప‌ర్ సిక్స్ ప్ర‌క‌టిస్తే ఇప్పుడు జ‌గ‌న్‌కు ఫ్ర‌స్టేష‌న్ మొద‌లైంది. ఎక్క‌డికి వెళ్లినా సూప‌ర్ సిక్స్ ప్ర‌జ‌ల్లోకి వెళ్లిపోయింది. ఇక నా ప‌నైపోయింది అని జ‌గ‌న్ గ్ర‌హించాడు. 

సూపర్ సిక్స్ మేనిఫెస్టో పిచ్చిది అంటున్నాడు. జ‌గ‌న్.. మా బాబు సూప‌ర్ సిక్స్ మేనిఫెస్టో నువ్వు ప్ర‌జ‌ల‌ను పీడిస్తున్న క‌ష్టాల నుంచి బ‌య‌టికి వ‌చ్చింది. ప్ర‌జ‌ల క‌న్నీరు నుంచి ఈ మేనిఫెస్టో పుట్టుకొచ్చింది. ఈ సైకో ప‌రిపాల‌న త‌రిమి త‌రిమి కొట్టేదానికి ఈ బాబు సూప‌ర్ సిక్స్ మేనిఫెస్టో వ‌చ్చింది. రాయ‌ల‌సీమ‌లో రాగి సంగ‌టి లాంటిది. అలాంటి ప‌విత్ర‌మైన మేనిఫెస్టో తీసుకుని కించ ప‌రిచే విధంగా మాట్లాడుతున్నాడు ఈ జ‌గ‌న్. జ‌గ‌న్.. ఓట‌మి దేవుడు స్క్రిప్ట్ రాసాడు. వాళ్ల పార్టీ అభ్య‌ర్ధులుగా నిల‌బ‌డేందుకు ఎవ్వ‌రూ సిద్ధంగా లేరు.

అందుకే వాళ్ల పార్టీ ఎంపీగా వేరే జిల్లాల నుంచి తీసుకొచ్చి నిల‌బెట్టే ప‌రిస్థితి వ‌చ్చింది. విశాఖ‌ప‌ట్నం ఎంపీని విజ‌య‌న‌గ‌రం నుంచి ట్రాన్స్‌ఫ‌ర్ చేసి తెచ్చారు. ఒంగోలు ఎంపీని చిత్తూరు జిల్లా నుంచి తీసుకొచ్చారు. న‌ర‌స‌రావుపేట ఎంపీగా బెట్టింగ్ స్టార్ అనిల్ కుమార్ యాద‌వ్‌ను నెల్లూరు నుంచి బ‌దిలీ చేసారు. గుంటూరు ఎంపీ స్థానంలో పోటీ చేసేందుకు అంబ‌టి రాయుడు ముందు కొస్తే ఎంత డ‌బ్బులు ఇస్తావ్ ఎప్పుడిస్తావ్ అని వేధిస్తే అత‌ను ఆ పార్టీ నుంచి పారిపోయాడు. 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో కనీసం 75 నియోజ‌క‌వ‌ర్గాల‌కు అభ్య‌ర్ధులు దొర‌క‌డంలేద‌ట‌. 

జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల‌న‌లో సామాజిక అన్యాయం మాత్ర‌మే జరిగింది. ఇది నేను చెప్ప‌డంలేదు. ఆ పార్టీ సొంత నేత‌లే మీడియా ముందుకు వ‌చ్చి ఈ మాట అంటున్నారు. ఇప్ప‌టికే 62 మంది ఎమ్మెల్యేల‌ను బదిలీ చేసారు. 16 మంది ఎంపీల‌ను కూడా బ‌దిలీ చేసారు. వారిలో ఎక్కువ శాతం మంది మైనారిటీల‌కు చెందిన‌వారే. బీసీల‌కు YCP పార్టీలో న్యాయం లేద‌ని ఆ పార్టీ ఎమ్మెల్సీనే చెప్తున్నారు. ప‌ద్మ‌శాలి సామాజిక వ‌ర్గానికి చెందిన సంజ‌య్ కుమార్ కూడా ఇదే మాట‌న్నారు. మైనారిటీ నేత‌ల‌ను క‌లిసేందుకు కూడా జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ ఇవ్వ‌డంలేద‌ట. అంటూ ఏకిపారేసారు నారా లోకేష్.