Nara Lokesh: స్వాతి.. నీకు TDP అండ‌గా ఉంటుంది

AP:బాబాయ్ కూతురిపైనా మార్ఫింగ్ పోస్టుల‌తో సోష‌ల్ మీడియా ద్వారా ఏపీ సీఎం జ‌గ‌న్ (jagan) దాడులు చేయిస్తున్నాడ‌ని ఆరోపించారు TDP నేత నారా లోకేష్ (nara lokesh). విదేశాల్లో TDP పోర్న్ స్టార్ అంటూ అంటూ స్వాతి రెడ్డి (swathi reddy) అనే అమ్మాయి ఫొటోలు వేసి పేప‌ర్‌లో వార్త‌లు రాసి ప్ర‌చురిస్తున్నారు. దీనిపై లోకేష్ స్పందిస్తూ.. ఆమె జగ‌న్ బాబాయ్ కూతురేన‌ని షాకింగ్ కామెంట్స్ చేసారు.

“సొంత తల్లి, చెల్లిని తరిమేసి..బాబాయ్ కూతురిపైనా మార్ఫింగ్ పోస్టులతో సోషల్ మీడియా వేదికగా దాడులు చేయిస్తోన్న కలియుగ కీచకుడు జగన్ రెడ్డి. సొంత బాబాయ్‌ని చంపేసి అక్రమ సంబంధాలు అంటకట్టిన దుర్మార్గుడు సైన్యం, సోషల్ మీడియాలో ప్రభుత్వ వైఫల్యాలు ప్రశ్నిస్తున్న అక్కాచెల్లెమ్మలపై పడింది. ఎన్ఆర్ఐ సోదరి స్వాతిరెడ్డి ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక వైకాపా కిరాయి మూకలు చేస్తున్న ఫేక్ మార్ఫింగ్ దాడులు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయి. వైకాపా పేటీఎం గ్యాంగుల ఫేక్ బూతురాతలకి జగన్ రెడ్డి, సజ్జల రెడ్డి, సజ్జల భార్గవరెడ్డి, డిజిపి సమాధానం చెప్పాలి. సోదరి స్వాతిరెడ్డి నీ వైపు న్యాయం ఉంది. తెలుగుదేశం నీకు అండగా ఉంటుంది” అని ట్వీట్ చేసారు.