Nara Lokesh: అంబటి అరగంట వీడియో చూడలేదా?!
Nara Lokesh: YSRCP వేసే రూ.5, రూ.10 తీసుకుని ఇష్టారాజ్యంగా కామెంట్స్, ట్వీట్స్ పెట్టే పేటీఎం కుక్కలకు భయపడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Elections) భాగంగా ఆయన చేపడుతున్న శంఖారావం (Shankharavam) కార్యక్రమం ఎచ్చెర్లకు చేరింది.
చంద్రబాబు (Chandrababu Naidu) సూపర్ 6 హామీలను ప్రజలకు చేర్చాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని అన్నారు. ఎవరు బాగా పనిచేస్తారో ఎవరైతే ఇచ్చిన కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారో వారికి తెలుగు దేశం పార్టీ నామినేటెడ్ పోస్ట్‌లు ఇచ్చే బాధ్యత తనది అని హామీ ఇచ్చారు. తనతో ఫోటోలు దిగితే సరిపోదని.. పని చేయాలని సూచించారు. ప్రజల మధ్యలో తిరిగే వారి వివరాలన్నీ తన ఫోన్‌లో కనిపిస్తాయని అన్నారు. ఎవరు పనిచేస్తున్నారో ఎవరు పని చేయడం లేదో తనకు బాగా తెలుసని.. పని చేయని వారి పేర్లు అందరి ముందు చెప్తే బాగోదని హెచ్చరించారు.
ఈ సభ చూస్తుంటే ఉత్తరాంధ్ర గర్జించింది అనిపిస్తోంది. ఉద్యమాల పోరాటాల గడ్డ ఉత్తరాంధ్ర. మీకు ఎవరైనా మంచి చేస్తే వారికి ప్రాణం ఇస్తారు. చెడు చేస్తే వారిని పాతేసే శక్తి మీలో ఉంది. ఉత్తరాంధ్ర జోష్ చూసాక ఒకటి అర్థమైంది. 2024 ఎన్నికల్లో ఫ్యాన్‌కు కరెంట్ షాక్ కొట్టడం ఖాయం. ఆ ఫ్యాన్ మాడి మసైపోయి భూమిపై పడటం ఖాయం. ఎందరో గొప్ప వ్యక్తులు ఇక్కడ జన్మించారు. ఇంతటి పవిత్ర భూమిపై ఈరోజు నేను మాట్లాడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎన్నికల అఫిడవిట్‌లో అభ్యర్ధిగా నిలబడినప్పుడు ఆస్తులు, అప్పులు, మనపై ఉన్న కేసులేంటి అన్నీ రాసి ఎన్నికల కమిషన్‌కు ఇవ్వాలి. అందులో 420 కేసులు 28 ఉన్న వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్. ఆయనకు 420 అయితే ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి ఒక 820. పేరుకే సలహాదారుడు కానీ ఇచ్చేవన్నీ పనికిమాలిన సలహాలు. ఆ సలహాలు ఇచ్చినందుకు ఆంధ్ర రాష్ట్ర ఖజానా నుంచి 150 కోట్ల రూపాయలు జీతంగా తీసుకున్నాడు.
ALSO READ: YS Sharmila: ఇన్నాళ్లూ గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా?
ఈ బ్రోకర్ ఈరోజు ఏకంగా రెండు ఓట్లు పెట్టుకుని తిరుగుతున్నాడు. ఒకటి మంగళగిరిలో రెండోది పొన్నూరులో. అప్పుడు అర్థమైంది.. ఈ దొంగ ఓట్లు వేసి గెలిచేదానికి YCP ప్రభుత్వం ప్రయత్నిస్తోందని. ఒక ప్రభుత్వ సలహాదారుడు దొంగ ఓట్లు పెట్టుకుని తిరుగుతున్నాడంటే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో ఆలోచించండి. తిరుపతి ఉప ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వం గెలిస్తే వీరికి దొంగ ఓట్లు ఉన్నాయి అందుకే గెలిచారని. అప్పుడే చెప్పా చట్ట విరుద్ధ పనులు చేస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని. (Nara Lokesh)
ఇప్పుడు ఏకంగా ఒక ఐఏఎస్, ఒక డీఎస్పీ, ఒక సీఐ. ఒక ఎస్సై సస్పెండ్ అయ్యే పరిస్థితికి వచ్చారు. అప్పుడే చెప్పా నా దగ్గర ఎర్ర పుస్తకం ఉందని. మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని. కొందరు వినలేదు. ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొన్న నలుగురు కుర్రాళ్లని కలిసి అన్నా తెలుగు దేశం పార్టీకి ఓటేస్తాం కానీ మీకు జగన్‌కి తేడా ఏంటని అడిగారు. అప్పుడు చెప్పా… తమ్ముళ్లూ మీ లోకేష్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని నమ్ముకున్న వ్యక్తి. కానీ జగన్ రాజా రెడ్డి రాజ్యాంగాన్ని నమ్ముకున్న వ్యక్తి. ఈ లోకేష ప్రజల్లో తిరుగుతాడు.. జగన్ పరదాలు కట్టుకుని తిరుగుతాడు. దొంగ స్కాంలలో జగన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన వ్యక్తి. నాకు క్లాస్‌మేట్స్ ఉంటే జగన్‌కు జైల్‌మేట్స్ ఉంటారు. జగన్‌కి కొత్త అవార్డు వచ్చింది. భారతదేశంలో అతి పనికిమాలిన క్యాబినెట్ జగన్ క్యాబినెట్ అని ఓ సంస్థ అవార్డు ఇచ్చింది.
మంత్రులు నిద్రపోతున్నప్పుడు వారిని లేపితే ఏ శాఖకు పని చేస్తున్నారో చెప్పుకునే పరిస్థితి లేదు. అప్పుల కోసం ఢిల్లీ చుట్టూ తిరిగే బుగ్గన. ఇసుకలు, గనులు మింగేసే గనుల శాఖ మంత్రి పాపాల పెద్ది రెడ్డి. నకిలీ మద్యం అమ్మే కాకాని గోవర్ధన్ రెడ్డి. అరగంట వీడియోతో వైరల్ అయిన మంత్రి అరగంట అంబటి రాంబాబు. ఇప్పుడు పెట్టుబడులు తీసుకురండి ఉద్యోగాలు కల్పించండి అని పరిశ్రమల శాఖ మంత్రిని అడిగితే కోడి ముందు వచ్చిందా గుడ్డు ముందు వచ్చిందా అని అడిగే పరిస్థితి కోడిగుడ్డు మంత్రి అమర్నాథ్‌ది. పిల్లలు బాగా చదువుతున్నారు అందుకే ఉద్యోగాలు లేవు అనే విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ… వీరంతా కేబినెట్ మంత్రులట అంటూ విమర్శలు గుప్పించారు నారా లోకేష్.