Nara Lokesh: లండ‌న్ మందులు మానేసావా జ‌గ‌న్?

AP: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ (jagan mohan reddy) రెడ్డిపై TDP జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ నారా లోకేష్ (nara lokesh) కామెంట్స్ చేసారు. లండన్ మందులు తీసుకోవ‌డం మానేసావా జ‌గ‌న్ అంటూ సెటైర్ వేసారు. వైజాగ్‌లో  (vizag) ఐటీ హ‌బ్ తీసుకొస్తాన‌ని చెప్పిన జ‌గ‌న్ రెండున్నర లక్షల ఎకరాలలో ఐటీ స్పేస్ తీసుకురాబోతున్నాన‌ని అన్నారు. నిజానికి వైజాగ్ న‌గ‌రం మొత్తం ఉన్న‌ది 1,58,100 ఎక‌రాలు. కానీ జ‌గ‌న్ వైజాగ్‌లో 2,50,000 ఎక‌రాల్లో ఐటీ హ‌బ్ క‌ట్ట‌బోతున్నార‌ని అనేసారు. దాంతో సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ మొద‌లైపోయింది. ఇదే టాపిక్‌పై నారా లోకేష్ స్పందించారు. “” ఏపీ మెంట‌ల్ సైకో 2,50,000 ఎక‌రాల్లో విశాఖ‌ప‌ట్నంలో ఐటీ హ‌బ్ క‌డ‌తాడ‌ట‌. న‌గ‌రం మొత్తం ఉన్న‌ది 1,58,100 ఎక‌రాల్లో. ఈయ‌న లండ‌న్ మెడిసిన్లు తీసుకోవ‌డం మానేసారా ఏంటి? “” అని వెట‌కారంగా ట్వీట్ వేసారు లోకేష్‌. (nara lokesh)