Nara Lokesh: జ‌గ‌న్ ఏదైతే జ‌ర‌గ‌కూడ‌దు అనుకున్నాడో అదే జ‌రిగింది

2024 ఎన్నిక‌లకు (ap elections) ముందు ఏపీ సీఎం జ‌గ‌న్..(jagan) TDP, జ‌నసేన (janasena) పొత్తు పెట్టుకోకూడ‌దు అనుకున్నాడ‌ని.. ఇప్పుడు పొత్తును ప్ర‌క‌టించ‌డంతో ఆయ‌న గుండెల్లో భ‌యం మొద‌లైంద‌ని అన్నారు TDP నేత నారా లోకేష్‌ (nara lokesh). 2019లో ఒక్క ఛాన్స్ అని అడుక్కోవ‌డంతో ప్ర‌జ‌లు న‌మ్మి అవ‌కాశం ఇచ్చార‌ని 2024లో వారు మ‌ళ్లీ ఆ త‌ప్పు చేయ‌ర‌ని అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకా ఐదు నెల‌లే స‌మ‌యం ఉంది కాబ‌ట్టి కొన్ని నెలల క్రితం TDP ప్ర‌క‌టించిన మినీ మేనిఫెస్టోను (mini manifesto) ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లాల‌ని నేత‌లకు, కార్య‌క‌ర్త‌ల‌కు తెలిపారు. ఈ ఐదు నెల‌లు సెల‌వులు, పండుగ‌లు అనే మాట లేకుండా 24 గంట‌లూ ప్ర‌జ‌ల మ‌ధ్య‌లోనే ఉంటూ వారిలో చైత‌న్యం తీసుకురావాల‌ని పిలుపునిచ్చారు.