Nara Lokesh: న‌న్ను రెండు సార్లు త‌నిఖీ చేసారు.. ఏం దొరికింది?

Nara Lokesh: దేశవ్యాప్తంగా ఎన్నిక‌ల నియ‌మావ‌ళి అమ‌ల్లోకి వ‌చ్చిన నేప‌థ్యంలో పోలీసులు అప్ర‌మ‌త్తమ‌య్యారు. సాధార‌ణ ప్ర‌జ‌ల నుంచి వీఐపీల వ‌ర‌కు అంద‌రి వాహ‌నాల‌ను త‌నిఖీ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) నేత నారా లోకేష్ కారును ఏపీ పోలీసులు ఇటీవ‌ల త‌నిఖీ చేసారు. అయితే ఒక‌సారి కాదు రెండు సార్లు ఆయ‌న కారును త‌నిఖీ చేసారు.

దీనిపై నారా లోకేష్ స్పందిస్తూ.. “” నా కారును ఏకంగా రెండు సార్లు త‌నిఖీ చేసారు. అస‌లు నా కారులో ఏముంటాయి? నేను టీ ఫ్లాస్క్, నీళ్లు మాత్రమే పెట్టుకుంటాను. కానీ మంగ‌ళ‌గిరిలో స్థానిక ఎమ్మెల్యే కారును మాత్రం ఒక్క‌సారి కూడా త‌నిఖీ చేయ‌లేదు “” అని తెలిపారు.