Nara Lokesh: ఏ ముఖం పెట్టుకుని ఓట్లడుగుతావు జగన్?

AP: ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతావ్ జ‌గ‌న్ అంటూ ప్ర‌శ్నించారు TDP నేత నారా లోకేష్‌ (nara lokesh). యువ‌గ‌ళం (yuvagalam) పాద‌యాత్ర‌లో ఉన్న లోకేష్ ప్ర‌స్తుతం వెంక‌ట‌గిరిలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో జగన్ (ap cm jagan) సర్కారు ప్రారంభించిన ప్రభుత్వ లిక్కర్ వాకిన్ స్టోర్ ద‌గ్గ‌ర సెల్ఫీ దిగారు. మద్యనిషేధం చేశాకే రాబోయే ఎన్నికల్లో ఓట్లడుగుతానన్న జ‌గ‌న్, రకరకాల పేర్లతో జనాన్ని మత్తులో ముంచేస్తున్నాడంటూ ఆరోపించారు. బినామీ కంపెనీల్లో తయారుచేసే జJ-బ్రాండ్ల మద్యాన్ని ఏరులై పారిస్తున్న జ‌గ‌న్… ఏ ముఖం పెట్టుకుని జనాన్ని ఓట్లు అడుగుతావు అని సూటిగా ప్ర‌శ్నించారు.