Nara Lokesh: దోచేసిన ఫర్నీచర్ ఎప్పుడిస్తావ్ జగన్?
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని ఫర్నీచర్‌ను తన ఇంట్లో పెట్టించుకుని సచివాలయంలో సమావేశాలు అవుతున్న బిల్డప్ ఇచ్చారు మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఇప్పుడు ఒక్కో బాగోతం బయటపడుతుండడంతో ఈవీఎంలలో మోసం జరిగితే అధికారంలోకి వచ్చారని తెలుగు దేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలపై ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు.
“”2019 ఎన్నికల్లో నువ్వు ఇవే ఈవీఎంల ద్వారా గెలిచావు. నువ్వు గెలిస్తే ఈవీఎంలు కరెక్ట్. మేం గెలిస్తే ఈవీఎంలలో తప్పులు ఉన్నాయంటావా? ఇదేం కపటత్వం? నువ్వు ఇన్నాళ్లూ ప్రజల ధనాన్ని దోచుకుని వారికోసం కేటాయించిన వ్యవస్థలను నాశనం చేసావు. అందుకే నిన్ను ప్రజలు వద్దు అనుకున్నారు. ఆ విషయం ఇప్పటికైనా తెలుసుకో. అన్నట్లు.. నువ్వు సచివాలయం నుంచి కొట్టేసిన ఫర్నీచర్ ఎప్పుడు తిరిగిస్తున్నావ్? ప్రజలకు చెందిన రూ.560 కోట్ల ధనంతో రుషికొండపై భవనాలు నీకోసం కట్టించుకున్నావా? వీటన్నింటికీ సమాధానాలు చెప్పు. ప్రజలకు కూడా తెలియాలి కదా “” అని సెటైర్ వేసారు లోకేష్