Nara Lokesh: AP రాజ‌ధాని ఏంటి? ఆన్స‌ర్ చెప్తే 1 ల‌క్ష‌!

AP: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ఏదో చెప్తే రూ.1 ల‌క్ష బ‌హుమ‌తిగా ఇస్తాన‌ని అన్నారు TDP నేత నారా లోకేష్‌ (nara lokesh). యువగ‌ళం పాద‌యాత్ర‌లో భాగంగా బ‌హిరంగ స‌భ‌ల్లో పాల్గొంటున్నారు లోకేష్‌. ఈ సంద‌ర్భంగా నిన్న స్థానిక యువ‌త‌ను క‌లిసి చ‌ర్చించారు. స‌మావేశంలో ఓ యువ‌కుడు ఏపీ రాజ‌ధాని ఏంటో తెలీక చాలా ఇబ్బందిప‌డిపోతున్నాం. కనీసం మీరైనా చెప్పాలి అని లోకేష్‌ను అడిగాడు. ఇందుకు లోకేష్ స్పందిస్తూ.. “ఇప్పుడు ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక తెచ్చింది లిక్క‌ర్ ఫ్యాక్ట‌రీలే కదా. అందుకే అంద‌రి ఫోక‌స్ మ‌ద్యంపైనే ఉంది. ఆ అబ్బాయి ఏపీ రాజ‌ధాని ఏది అని అడుగుతున్నాడు. ఇందుకు ఎవ‌రైనా స‌మాధానం చెప్తే వారికి రూ.1 ల‌క్ష బ‌హుమ‌తి ఇస్తా” అన్నారు. ఇందుకు అంద‌రూ అమ‌రావ‌తి అని అరిచారు. అప్పుడు లోకేష్‌.. “అమ‌రావ‌తిని రాజ‌ధాని చేయ‌డానికి ఇప్పుడున్న సీఎం ఒప్పుకోవ‌డంలేదు క‌దా.. ఇప్పుడు ఏపీకి వ‌చ్చిన సంస్థ‌ల్లో అమ‌రావ‌తికి వ‌చ్చిన సంస్థ ఏదీలేదు. అదే బాబుగారు ఉండి ఉంటే ఏపీలోని ఒక్కో జిల్లా రూపురేఖ‌లే మారిపోయేవి” అని తెలిపారు లోకేష్.