Nara Brahmani: మంగళగిరి చీర కట్టుకుంటే.. అదే గుర్తొస్తుంది
Nara Brahmani: తెలుగు దేశం పార్టీ మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి మంగళగిరి చీరలపై తనకున్న ప్రేమ గురించి ట్వీట్ చేయడం ఆసక్తిగా మారింది. నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానికి బ్రాహ్మణి మంగళగిరిలో నేసిన పసుపు రంగు చీరను కట్టుకున్నారు. తన భర్తతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేస్తూ.. “” మా ఇద్దరికీ మంగళగిరి అంటే ఇష్టం. మంగళగిరిలో నేసిన చీరను కట్టుకున్న ప్రతీసారి అక్కడ చీరలు నేసేవారు తమ ప్రాణం పెట్టి మరీ నేస్తారన్న విషయం గుర్తుకొస్తుంది. అంత కష్టపడి వారు నేసే చీరలను నేను ప్రత్యేక సందర్భాల్లో కట్టుకుంటూ ఉంటాను “” అని తెలిపారు.