Nara Bhuvaneswari: మా ఆయన చేసిన త‌ప్పేంటి?

అనుక్ష‌ణం ప్ర‌జ‌ల కోస‌మే పోరాడి వారి అభివృద్ధి గురించి ఆలోచించిన త‌న భ‌ర్త చంద్ర‌బాబు నాయుడిని  (chandrababu naidu) ఈరోజు ఆయ‌న క‌ట్టించిన రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లోనే బందీగా ఉంచార‌ని అన్నారు నారా భువ‌నేశ్వ‌రి (nara bhuvaneswari). జ‌గ్గ‌య్య‌పేట‌లో ఏర్పాటుచేసిన తెలుగు దేశం పార్టీ నిర‌స‌న దీక్ష‌లో పాల్గొన్న భువ‌నేశ్వ‌రి.. త‌న భ‌ర్త‌కు స‌పోర్ట్ చేస్తున్న‌వారికి సంఘీభావం తెలిపారు. త‌న భ‌ర్త ఏం త‌ప్పు చేసారు అని అధికార ప్ర‌భుత్వాన్ని నిల‌దీసారు.

“” నా భ‌ర్త మంత్రి అయిన‌ప్పుడు హెరిటేజ్ సంస్థ‌లో తీసుకెళ్లి వ‌దిలేసారు. అస‌లు నాకేమీ చెప్ప‌లేదు. నాకు టైం లేదు.. నువ్వే తెలుసుకో.. నువ్వు అన్నీ నేర్చుకో అని చెప్పారు. నాకు ఏమీ తెలీదు. మూడు నెల‌లు నాకు నేను అన్నీ గ‌మ‌నించి అర్థం చేసుకుని తెలుసుకున్నాను. ఇదంతా నేను నా గొప్పత‌నం అని చెప్ప‌డంలేదు. ఆడ‌వాళ్ల‌కు ఆ శ‌క్తి ఉంటుందని చెప్ప‌డానికి ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పాను. మ‌న‌లో దుర్గాదేవి శ‌క్తి ఉంటుంది. మాకు కూడా కుటుంబంలో స‌మ‌స్య‌లు వ‌స్తాయి. కానీ ఏడుస్తూ కూర్చోను. నేను చెయ్య‌గ‌ల‌ను అనుకుని న‌మ్మ‌కంతో ముంద‌కెళ్తాను. దేవుడే నాకు దారి చూపిస్తాడు. మాకు ప్ర‌జ‌ల డ‌బ్బు అవ‌స‌రం లేదు. నేను నడుపుతున్న కంపెనీలో 2% అమ్మినా 400 కోట్ల తెల్ల డబ్బు వస్తుంది “” అని తెలిపారు.