Nara Bhuvaneswari: నాకు నోటీసులా.. జ‌గ‌న్‌కి ఆ హక్కెక్కడిది?

నారా భువ‌నేశ్వ‌రిని (nara bhuvaneswari) TDP కార్య‌క‌ర్త‌లు, నేత‌లు ఎవ్వ‌రూ క‌ల‌వ‌కూడ‌ద‌ని.. అలా క‌లిసిన‌ట్లైతే వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు భువ‌నేశ్వ‌రికి నోటీసులు పంపారు. ఈ నోటీసుల‌పై భువ‌నేశ్వ‌రి స్పందిస్తూ.. త‌న‌కు నోటీసులు ఇవ్వ‌డానికి జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఏం హ‌క్కు ఉంద‌ని ప్ర‌శ్నించారు.

“” చంద్రబాబుగారికి మద్దతుగా, రాజమండ్రిలో ఉన్న నన్ను కలిసి నాకు మనోధైర్యాన్ని ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంఘీ భావయాత్ర చేపడితే అందులో తప్పేముంది? పార్టీ కార్యకర్తలు మా బిడ్డల్లాంటి వాళ్ళు. బాధలో ఉన్న అమ్మను కలిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు నోటీసులు ఇవ్వడం ఏంటి? ప్రజలు, మద్దతుదారులు నన్ను కలవకూడదని చెప్పడానికి ఈ ప్రభుత్వానికి హక్కెక్కడిది? “” అని ట్వీట్ చేసారు.