Nara Bhuvaneswari: ఆంధ్రప్ర‌దేశ్‌లో ఆకలి అనే పదం విన‌ప‌డకూడ‌దు

Nara Bhuvaneswari:

*ఆకలి అనే పదం వినబడకూడదనే చంద్రబాబు అన్నా క్యాంటీన్లు పెట్టారు*
*- పేదవాళ్ల ఆకలి తీర్చేందుకు నాడు ఎన్టీఆర్ రూ.2కే కేజీ బియ్యం ఇచ్చారు*
*- జగన్ సర్కార్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా TDP ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్లు*
*- అన్నా క్యాంటీన్లు నిలిపేసి పేదవాడి పొట్ట కొట్టిన జగన్ సర్కార్*
*- కుప్పంలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవంలో భువనేశ్వరి వ్యాఖ్య*

అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ లో (Andhra Pradesh) ఆకలి అనే పదం వినబడకూడదనే మహోన్నత లక్ష్యంతో తెలుగు దేశం పార్టీ అధినేత‌ చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) 2018లో అన్నా క్యాంటీన్లను ప్రారంభించారని చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. కుప్పం (Kuppam) నియోజకవర్గంలో నిజం గెలవాలి (Nijam Gelavali) పర్యటన సందర్భంగా గుడిపల్లి గ్రామంలో అన్నా క్యాంటీన్ ను భువనమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ…. (Nara Bhuvaneswari)

ALSO READ: Pawan Kalyan: యుద్ధానికి సర్వం “సిద్ధం”..!

• కుప్పం కుటుంబ సభ్యుల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది.
• పేదవాడికి మూడుపూటలా అతి తక్కువ ఖర్చుతో కడుపునిండా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు.
• రాష్ట్రవ్యాప్తంగా 2018లో 364 క్యాంటీన్లను ఏర్పాటు చేశారు.
• ఒక్క రోజులో ఈ క్యాంటీన్లలో 2.25లక్షల మంది భోజనం చేసేవారు.
• ఒక్క సంవత్సరంలో అన్నా క్యాంటీన్లలో 7.50కోట్ల మంది తమ ఆకలిని తీర్చుకున్నారు.
• అన్నా క్యాంటీన్ల వంటి గొప్ప కార్యక్రమాన్ని గతంలో ఏ ప్రభుత్వమూ నిర్వహించలేదు.
• జగన్ మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పేదవాడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను కూల్చేశారు…నిలిపేశారు.
• తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అన్నా క్యాంటీన్లను నిర్వహిస్తే వారిపై నిర్బంధాలు, దాడులకు YSRCP సర్కార్ దిగింది.
• జగన్ మోహ‌న్ రెడ్డి సర్కార్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడా వెనకడుగు వేయకుండా రాష్ట్రంలో నేడు 150 క్యాంటీన్లను నడుపుతున్నారు…వారందరికీ నా కృతజ్ఞతలు, అభినందనలు.
• మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ 4 అన్నా క్యాంటీన్లను నిర్వహిస్తున్నారు.
• కుప్పం కుటుంబ సభ్యుల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో 3 అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తున్నాం. వీటితో కలిపి కుప్పం కుటుంబ సభ్యులకు మొత్తం 4 అన్నా క్యాంటీన్లు అందుబాటులో ఉంటాయి.

మీ అభిమానాన్ని, విశ్వాసాన్ని ఎప్పటికీ మరువలేం….

• కుప్పం కుటుంబ సభ్యులు చంద్రబాబుపై పెట్టుకున్న నమ్మకం, విశ్వాసం, అభిమానాన్ని మా కుటుంబం ఎప్పటికీ మరచిపోదు.
• కుప్పం నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా చంద్రబాబు నాయుడుతోనే కుప్పం ప్రజలు నిలుస్తున్నారు.
• రాష్ట్ర భవిష్యత్తు, కుప్పం ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు సరైన వ్యక్తి అని చెబుతున్న కుప్పం ప్రజల నమ్మకానికి నా ధన్యవాదాలు.
• చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న 53రోజులు కుప్పం కుటుంబ సభ్యులు పడిన బాధ, ఆవేదన వర్ణించలేనిది.
• YSRCP ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా చంద్రబాబు నాయుడు కోసం నిరాహారదీక్షలు, మౌనదీక్షలను వెనక్కి తగ్గకుండా చేసిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు.
• మా కుటుంబం కుప్పం ప్రజల ప్రేమాభిమానాలకు నా ధన్యవాదాలు అని తెలిపారు నారా భువ‌నేశ్వ‌రి.

ALSO READ: Pawan Kalyan: ఇక వార్ వ‌న్‌సైడ్..!

చంద్ర‌బాబు నాయుడు అరెస్ట్ అయిన‌ప్పుడు దాదాపు 100 మంది గుండెపోటుతో మ‌ర‌ణించార‌ని తెలుగు దేశం పార్టీ చెప్తోంది. ఇది నిజ‌మో అబ‌ద్ధ‌మో తెలీదు కానీ నారా భువ‌నేశ్వ‌రి మాత్రం వారిని ఓదార్చేందుకు భువ‌నేశ్వ‌రి నిజం గెల‌వాలి అనే యాత్ర‌ను చేప‌ట్టారు. చంద్ర‌బాబు నాయుడు జైలు పాల‌య్యారు అని తెలిసి గుండెపోటుతో మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌ను క‌లుస్తూ వారిని ఓదారుస్తున్నారు. వారికి ఆర్ధిక సాయాన్ని ప్ర‌క‌టిస్తున్నారు. ఈసారి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెలవాల‌న్న ఉద్దేశంతో ఎప్పుడూ లేనిది తొలిసారి నారా భువ‌నేశ్వ‌రి కూడా ప‌ర్య‌ట‌న‌ల్లో పాల్గొంటున్నారు.