Congress: మ‌ల్కాజ్‌గిరి టికెట్ ముమ్మాటికీ నాదే

మల్కాజిగిరి కాంగ్రెస్ (congress) పార్టీ టికెట్ నాదే.. ఒకవేళ నన్ను కాదని మైనంపల్లికి (mynampally hanumanth rao) టికెట్ ఇస్తే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా అని తెలిపారు మేడ్చల్ మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ (nandikanti sridhar). ఇంకొన్ని రోజుల్లో మైనంప‌ల్లి హ‌నుమంత‌రావు కాంగ్రెస్‌లో చేర‌నున్నారు. మ‌ల్కాజ్‌గిరి టికెట్‌తో పాటు ఇంకో టికెట్ కూడా ఇస్తామ‌ని కాంగ్రెస్ హైక‌మాండ్ త‌న‌కు తెలిపింద‌ని మైనంప‌ల్లి అన్నారు. ఈ నేప‌థ్యంలో శ్రీధ‌ర్ మీడియా ముందుకు వచ్చి టికెట్ త‌న‌కు కాకుండా మైనంప‌ల్లికి ఇస్తే త‌ర్వాత ఏం చేస్తానో చెప్తాన‌ని తెలిపారు.