Nagam: కాంగ్రెస్‌కు నాగం జ‌నార్ధ‌న్ రెడ్డి రాజీనామా

Telangana Elections: నాగ‌ర్ క‌ర్నూల్ టికెట్ ఆశించిన నాగం జనార్ధ‌న్ రెడ్డికి (nagam janardhan reddy) టికెట్ రాక‌పోవ‌డంతో ఆయ‌న పార్టీకి రాజీనామా చేసారు. ఆ టికెట్‌ను రాజేశ్ రెడ్డికి కేటాయించారు. దాంతో జ‌నార్ధ‌న్ రెడ్డి అలిగారు. 30 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి ఎంతో చేసాన‌ని.. నాగ‌ర్ కర్నూల్‌లో కాంగ్రెస్ పార్టీని బ‌లోపేతం చేసింది తానేన‌ని రాజీనామా లేఖ‌లో పేర్కొన్నారు. అస‌లు రాజేశ్ రెడ్డి ఒక డెంట‌ల్ డాక్ట‌ర్ అని ఆయ‌నకు రాజీకాయాలు కొత్త అని అలాంటి కొత్త వ్య‌క్తికి ఎలా టికెట్ ఇస్తార‌ని ప్ర‌శ్నించారు. క‌నీసం టికెట్ వేరొక‌రికి ఇచ్చేముందు త‌న‌ను సంప్ర‌దించ‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసారు. ఈరోజు సాయంత్రం నాగం హరీశ్ రావు సమక్షంలో BRS పార్టీలో చేర‌నున్నారు.