Naga Babu: TTD ఛైర్మ‌న్‌గా నాగ‌బాబు

naga babu to get ttd chairman post

Naga Babu: జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ గెల‌వాల‌ని త‌న టికెట్‌ను కూడా త్యాగం చేసారు పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ నాగ‌బాబు. పార్టీ కోసం ఎప్ప‌టిక‌ప్పుడు అందుబాటులో ఉంటూ త‌మ్ముడి గెలుపు కోసం ప‌ని చేసిన నాగ‌బాబుకు ప్ర‌భుత్వం కీల‌క ప‌ద‌వి ఇచ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఛైర్మ‌న్ పోస్ట్‌ను నాగ‌బాబుకు ఇవ్వాల‌ని ప‌వ‌న్ కళ్యాణ్ తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడిని కోరిన‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల సమాచారం. ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోగానే.. తొల‌గించ‌కుండానే తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఛైర్మ‌న్‌గా ఉన్న భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి వెంట‌నే రాజీనామా చేసేసారు. దాంతో ఆ ప‌ద‌వి నాగ‌బాబుకు ద‌క్కే అవ‌కాశం క‌నిపిస్తోంది.