Naga Babu: నాగ‌బాబుకి పోసాని పోస్ట్?

naga babu to get posani krishna murali post

Naga Babu:  జ‌న‌సేన పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ నాగ‌బాబుకు కీల‌క ప‌ద‌వి ఇవ్వాల‌ని పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ యోచిస్తున్నారు. త‌మ్ముడి గెలుపు కోసం త‌న తిరుప‌తి సీటును వ‌దులుకున్న నాగ‌బాబు త‌న‌కు ప‌ద‌వి ఇవ్వ‌క‌పోయినా ఫ‌ర్వాలేద‌ని.. త‌న త‌మ్ముడి వెన్నంటే న‌డుస్తాన‌ని అన్నారు. అయితే ఇప్పుడు నాగ‌బాబుకి ఇచ్చే పోస్ట్‌పై మ‌రో ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. నాగ‌బాబుకు ఫిలిం డెవ‌లప్మెంట్ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ఫిలిం డెవ‌లప్మెంట్ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్‌గా న‌టుడు పోసాని కృష్ణ‌ముర‌ళి ఉన్నారు. ఇప్పుడు ఆ ప‌ద‌వి నాగ‌బాబుకు ద‌క్క‌నున్న‌ట్లు తెలుస్తోంది.