Naga Babu: మొరగకండి అంటూ స్ట్రాంగ్ కౌంటర్.. రాడ్ దింపేసారుగా
Naga Babu: తెలుగు దేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు కలిసి నిర్వహించిన్ ప్రజా గళం సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతుంటే మైక్ ఫెయిల్ అవ్వడం పెద్ద చర్చకు దారి తీసింది. దాంతో మైక్ ఫెయిల్, సభ ఫెయిల్, కూటమి ఫెయిల్ అంటూ YSRCP నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఇలా సెటైర్లు వేస్తున్నవారిపై జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు రిప్లై ఇచ్చారు.
“” మైకు ఫెయిలు,మీటింగు ఫెయిలు అని మొరిగే మూర్ఖులంతా విన్నారా.. నిన్న గౌరవ ప్రధాని మోదీ గారు మీకు ‘భ్రష్టాచార్’ అనే బిరుదు ఇచ్చారు. భ్రష్టాచార్ అంటే ‘అవినీతి’ .. అవినీతి అంటే కరప్షన్… అవినీతి అనే కోటకి మకుటం లేని మహారాజు మీ నాయకుడు. ఆ అవినీతి కిరీటాన్ని మాక్కావాలి మాక్కావాలి మేమేం తక్కువ అని పోటి పడుతున్న మీరు కూడా, మా సభలని విమర్శిస్తుంటే ఎలా నవ్వాలో తెలీడం లేదు. మీ సిద్దం సభల గ్రీన్ మ్యాట్ గ్రాఫిక్స్‌లు గాల్లో దీపాల్లా తేలిపోతున్నాయ్. ముందు మీరు ఆ VFX ఎడిటర్‌ని మార్చితే తప్ప లక్షల్లో జనాలొచ్చారని ప్రజల్ని ఏమార్చలేరు.
ముందు ఆ పన్లో ఉండండయ్యా భరితెగించిన భ్రష్టాచార్స్.. ! “” అని చురకలు అంటించారు నాగబాబు.
మైకు ఫెయిలు,మీటింగు ఫెయిలు అని మొరిగే మూర్ఖులంతా విన్నార నిన్న గౌరవ ప్రధాని మోదీ గారు మీకు 'భ్రష్టాచార్' అనే బిరుదు నిచ్చారు..
భ్రష్టాచార్ అంటే 'అవినీతి' .. అవినీతి అంటే Corruption… అవినీతి అనే కోటకి మకుటం లేని మహారాజు మీ నాయకుడు ఆ అవినీతి కిరీటాన్ని మాక్కావాలి మాక్కావాలి…— Naga Babu Konidela (@NagaBabuOffl) March 18, 2024