Naga Babu: ముఖ్యమంత్రి పీఠం జనసేనదే

జ‌న‌సేనాని ప‌వ‌న్ కళ్యాణ్ (pawan kalyan) రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తిరుప‌తి నుంచి పోటీ చేసే అవ‌కాశం ఉంద‌ని అన్నారు నాగ‌బాబు (naga babu). TDP అధినేత చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) అరెస్ట్‌తో ఆ పార్టీకి జ‌న‌సేనే దిక్కని.. ఒక‌వేళ అధికారంలోకి వ‌స్తే తెలుగు దేశం పార్టీ నేత‌లు జ‌న‌సేన కిందే ప‌నిచేయాల‌ని నాగ‌బాబు కార్య‌క‌ర్త‌ల‌తో అన్న‌ట్లు తెలుస్తోంది. సీఎం అభ్య‌ర్ధిగా ప‌వ‌న్ క‌ళ్యాణే ఉండాల‌ని పార్టీ ఆశ‌ప‌డుతోంది కాబ‌ట్టి ప‌వ‌నే నిల‌బ‌డ‌తాడ‌ని కూడా అన్నార‌ట‌. అయితే గ‌తంలో TDP కార్య‌క‌ర్త‌లు, నేతలు త‌మ‌ను ఎంతో క్షోభ పెట్టార‌ని అవ‌న్నీ ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేమ‌ని జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు నాగ‌బాబు ముందు గ‌గ్గోలు పెట్టుకున్నార‌ట‌. వీరికి సర్దిచెప్పేందుకు నాగ‌బాబు.. గ‌తంలో జ‌రిగిన విష‌యాలు మ‌ర్చిపోయి ఇప్పుడు చంద్ర‌బాబు అరెస్ట్‌ను సద్వినియోగం చేసుకుందామ‌ని నిన్న చిత్తూరులో జరిగిన కార్య‌క్ర‌మంలో నాగ‌బాబు ఈ విష‌యాలు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లతో అన్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.