Naga Babu: ట్వీట్ డిలీట్ చేసాను.. తప్పు ఒప్పుకున్న మెగా బ్రదర్?
Naga Babu: నేను ట్వీట్ డిలీట్ చేసాను అని నాగబాబు ట్వీట్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్ వైఎస్సార్ కాంగ్రెస్ నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి తరఫున ప్రచారం చేసేందుకు వెళ్లారు. మరోపక్క తన మామ అయిన జనసేనాని పవన్ కళ్యాణ్ కోసం ఏ ప్రచారంలోనూ పాల్గొనలేదు. కానీ తన మద్దతు మాత్రం పవన్‌కు ఎప్పుడూ ఉంటుందని ట్వీట్ వేసారు.
దీనిపై నాగబాబు ఓ ట్వీట్ పెట్టారు. మాకు సపోర్ట్ చేయనివాడు మావాడైనా పరాయివాడే.. మాకు అండగా నిలబడిన వాడు పరాయివాడైనా మావాడే అని నాగబాబు ట్వీట్ చేసారు. ఆయన పేరు చెప్పకపోయినా పరోక్షంగా అల్లు అర్జున్ గురించే కామెంట్ పెట్టారని అందరికీ క్లియర్‌గా అర్థమైంది. ఆ తర్వాత సోషల్ మీడియాలో విపరీతమైన రచ్చ జరిగింది. మా అల్లు అర్జున్‌ని అంటావా అని నాగబాబుపై.. పవన్‌కి మద్దతు తెలపకుండా వైఎస్సార్ కాంగ్రెస్ నేతకు మద్దతు తెలుపుతావా అంటూ అల్లు అర్జున్‌పై విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. దాంతో ఈ చర్చకు ఫుల్స్టాప్ పెట్టాలనుకున్నారో.. లేక ఇంట్లో మనిషిపై తప్పుగా ట్వీట్ చేసానని నాగబాబు తన తప్పును తెలుసుకున్నారో తెలీదు కానీ ఆ ట్వీట్‌ని ఆయన డిలీట్ చేసారు.