Naga Babu: అందుకే మోదీ గారూ మీరంటే మాకు గౌర‌వం

naga babu praising tweet on narendra modi

Naga Babu: ఈరోజు ఉద‌యాన్నే ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని ప్ర‌శంసిస్తూ ట్వీట్ చేసారు జ‌నసేన పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నాగ‌బాబు. ఇండియా కూట‌మిలోని నేత‌లు చేసిన నేరాల ఎక్స్‌రేలు బ‌య‌ట‌పెట్టి.. వారు తిన్న‌దంతా ప్ర‌జ‌ల‌కు పంచిపెడ‌తాను అని మోదీ చేసిన వ్యాఖ్య‌ల‌ను ప్ర‌స్తావిస్తూ ఓ ఆంగ్ల ప‌త్రిక ఆర్టిక‌ల్ రాసింది. దానిని నాగ‌బాబు ట్విట‌ర్‌లో పోస్ట్ చేస్తూ.. “” ఎన్నో పొట్టలు కొట్టిన అక్రమార్కుల కోటలు కొట్టి పేదోడి అవసరాలు తీర్చాలనుకునే మీ ఆలోచనకి హ్యాట్సాఫ్…అందుకే సర్ మీరంటే మాకంత గౌరవం “” అని ట్వీట్ చేసారు.