Naga Babu: ఓట‌మి భ‌యంతో వారేమ‌న్నా ప‌ట్టించుకోవ‌ద్దు

Naga Babu message to jana sainiks ahead of counting

Naga Babu:  జూన్ 4న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ నాగ‌బాబు ఓ వీడియో రిలీజ్ చేసారు. ఎన్నిక‌ల్లో గెల‌వ‌బోయేది కూట‌మే అని అందులో ఏమాత్రం సందేహం లేద‌ని.. కౌంటింగ్ రోజున ఎక్క‌డ ఓడిపోతామో అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వేసే ఎత్తుల‌ను తిప్పికొడ‌దామ‌ని అన్నారు. ప్ర‌జాస్వామ్యాన్ని గౌర‌వించేలా మ‌నం చేసే ప‌నులు ఉండాల‌ని.. గెలుపు కూట‌మిదే కాబ‌ట్టి ఈలోగా వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డితే వాటికి స్పందించ‌క‌పోవ‌డం మంచిద‌ని నాగ‌బాబు పిలుపునిచ్చారు.