RGV vs Naga Babu: నా సినిమాలో కమెడియన్ మీరే సార్…!
RGV vs Naga Babu: దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి నిర్మాత నాగబాబుకి మధ్య ట్విటర్ యుద్ధం జరిగింది. రామ్ గోపాల్ వర్మ తల నరికి తెస్తే కోటి రూపాయలు ఇస్తానని తెలుగు దేశం పార్టీ మద్దతుదారు కొలికపూడి శ్రీనివాస్ రావు లైవ్ టీవీలో ఛాలెంజ్ చేసిన నేపథ్యంలో నాగబాబు స్పందించారు.
నాగబాబు స్పందన
తన తల నరికి తెస్తే కోటి రూపాయలు ఇస్తానని సవాల్ చేసిన వ్యక్తిపై ఫిర్యాదు చేసిన రామ్ గోపాల్ వర్మ. దీనిపై నా రియాక్షన్ ఏంటంటే.. వర్మ గారూ మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు. మీ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డు వేస్తాను. ఎవ్వరూ కూడా మీ తల నరికి తేలేరు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో.. ఆ మాటకొస్తే ఇండియాలో ఏ పనికిమాలిన ఎదవ మీకు హాని తలపెట్టడు. ఎందుకంటే హీరో విలన్ మధ్య యుద్ధం జరుగుతుంటే ఎవ్వరూ కూడా కమెడియన్‌ని చంపాలని అనుకోరు కదా..! కాబట్టి నిర్భయంగా ఓ వోడ్కా వేసి పడుకోండి అని కామెంట్ చేసారు.
వర్మ రియాక్షన్
సార్ నా కన్నా పెద్ద కమెడియన్ ఎవడంటే , నా సినిమాలో మీ. మీ తమ్ముడి దగ్గర డబ్బులడుక్కుని టీ తాగి పడుకోండి అని కామెంట్ చేసారు.