Naga Babu: ఆలోచించాల్సిన సమయం కాదిది

Naga Babu: ఆలోచించాల్సిన సమయం కాదిది, నాయకుడి ఆదేశాలని‌ ఆచరణలో పెట్టాల్సిన సమయం అని అన్నారు జనసేన ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నాగ‌బాబు. తెలుగు దేశం, జ‌న‌సేన పార్టీల‌తో భార‌తీయ జ‌న‌తా పార్టీకి పొత్తు కుదిరిన నేప‌థ్యంలో ఆయ‌న ట్వీట్ చేసారు.

“”” సందిగ్ధాల సమయం కాదిది, సమరానికి సిద్దమవ్వాల్సిన సమయం, విమర్శ, విభేదాల సమయం కాదిది, విజ్ఞతతో విజయ దుందుభి మోగించాల్సిన సమయం. శత్రువు మాయలో పడి నాలుగేళ్ల దగా మర్చిపోతున్నావ్, తీర్చుకోవాల్సిన పగా మర్చిపోతున్నావ్.. నిర్లక్ష్యం వీడు, నిజాన్ని చూడు, న‌మ్మి నాయకుడి నిర్ణయాలతో నిలబడు… సేనా..సిద్దం సిద్దం అన్నోళ్ళకి ఈసారి ఇద్దాం మర్చిపోలేని యుద్ధం… “”” అని ట్వీట్ చేసారు