Mynampally: ఎవరినైనా చంపుతా.. ఆడియో లీక్ వైరల్
కొంతకాలంగా BRS నేతలను, మంత్రి హరీష్ రావును నోటికొచ్చినట్లు మాట్లాడి వివాదాస్పదమైన మైనంపల్లి హనుమంతరావు (mynampally) ఆడియో ఒకటి లీకైంది. అందులో..“” రేవంత్ రెడ్డిని తొక్కుతాను.. నేను KCR, KTR, మోడీ ఎవరికీ భయపడను. నేను తలుచుకుంటే ఎవరినైనా మర్డర్ చేయగలుగుతా. సమైఖ్యాంధ్ర ఉద్యమంకి సపోర్ట్ చేశాను “” అంటూ మాట్లాడినట్లు తెలుస్తోంది.
తన కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదన్న అక్కసుతో మైనంపల్లి కొంతకాలంగా BRSకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. తన కుమారుడు మెడిసిన్ చదివి సోషల్ సర్వీస్ చేస్తున్నాడని.. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (telangana elections) తన కొడుక్కి టికెట్ ఇస్తే రోజుకి రెండు గంటలే నిద్రపోయి మరీ ఎలాగో అలా గెలిపించుకుంటానని అన్నారు. తన కుమారుడికి టికెట్ ఇచ్చే విషయంలో హరీష్ రావు పెత్తందారుగా వ్యవహరిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. అయినా కూడా సీఎం KCR ఆయన మాటలు లెక్కచేయకుండా టికెట్ కొడుక్కి ఇవ్వకుండా మైనంపల్లికే ఇచ్చారు. (mynampally hanumanth rao)