EXCLUSIVE: ఓడినా రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్..!
EXCLUSIVE: మైనంపల్లి హనుమంతరావుకు (mynampally hanumanth rao) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (revanth reddy) బంపర్ ఆఫర్ ఇవ్వనున్నట్లు చర్చ నడుస్తోంది. పార్టీలో ఉన్నప్పుడు మైనంపల్లి తన కుమారుడు రోహిత్ రావుకు (rohit rao) టికెట్ ఇవ్వాలని కోరగా మాజీ సీఎం కేసీఆర్ ఇవ్వలేదు. దాంతో అలిగి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కాంగ్రెస్లోకి వెళ్లగానే హనుమంతరావుతో పాటు రోహిత్ రావుకు కూడా టికెట్ కేటాయించింది కాంగ్రెస్. కానీ అనూహ్యంగా ఎన్నికల్లో హనుమంతరావు ఓడిపోగా రోహిత్ మెదక్లో గెలిచారు.
అయితే మొన్న జరిగిన ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో రేవంత్ రెడ్డితో పాటు మరో 11 మంత్రులు మాత్రమే ప్రమాణస్వీకారం చేసారు. తెలంగాణ క్యాబినెట్లో 18 మందికి చోటు ఉంది. ఇంకా ఆరుగురు మంత్రులు కన్ఫాం కావాల్సి ఉంది. అయితే ఆ ఆరు సీట్లలో ఒక సీటు మైనంపల్లి హనుమంతరావుకి కల్పించాలన్న యోచనలో ఉన్నారు రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యేగా ఓడిపోయారని ఎమ్మెల్సీ ఇచ్చి తన క్యాబినెట్లో చేర్చుకోవాలని చూస్తున్నారట. మరోపక్క మైనారిటీల నుంచి ఒక్క నేత కూడా రేవంత్ కేబినెట్లో లేరు. దాంతో ఫిరోజ్ ఖాన్కు (feroz khan) ఆ అవకాశం కల్పించాలని కూడా రేవంత్ ప్లాన్ వేస్తున్నారు. హనుమంతరావు, ఫిరోజ్ ఖాన్లకు తన కేబినెట్లో చోటు కల్పిస్తే గ్రేటర్ హైదరాబాద్లో కూడా కాంగ్రెస్కు పట్టు ఉంటుందని రేవంత్ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.