Murali Mohan: ఆ జైలు సంగ‌తి నాకు తెలుసు.. బాబు భ‌ద్ర‌త‌పై అనుమానం

చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) ఉన్న రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలు సంగ‌తి త‌న‌కు బాగా తెలుస‌ని అన్నారు రాజ‌మండ్రి మాజీ ఎంపీ ముర‌ళీ మోహ‌న్ (murali mohan). ఆ జైలు సంగ‌తి త‌న‌కు బాగా తెలుసని.. అక్క‌డ చంద్ర‌బాబుకి ఏమాత్రం భ‌ద్ర‌త లేద‌ని అన్నారు. ఆయ‌న‌కు భారీ భ‌ద్ర‌త క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. ఆయ‌న‌కు ఏమ‌న్నా అయితే రాష్ట్ర ప్ర‌భుత్వం బాధ్య‌త వ‌హించాల్సిందేన‌ని అన్నారు. ముందుచూపు ఉన్న నేత‌ను ఇలా అక్ర‌మ కేసులో అరెస్ట్ చేయ‌డం నిజంగా బాధాక‌ర‌మ‌ని తెలిపారు. కార్య‌క‌ర్త‌లు అన‌వ‌స‌ర‌మైన గొడ‌వలు పెట్టుకుని జైలు పాలు కావ‌ద్ద‌ని.. ఇలా అంద‌రూ జైలుకి వెళ్లిపోతే రానున్న ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేయ‌డానికి స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌తాయ‌ని స‌ల‌హా ఇచ్చారు. (murali mohan)