Seethakka: ములుగు ఎమ్మెల్యే కుమారుడి ఘ‌రానా మోసం..

Telangana Elections: ములుగు ఎమ్మెల్యే సీత‌క్క (seethakka) అలియాస్ ద‌న‌స‌రి అన‌సూయ పెద్ద వివాదంలో ఇరుక్కున్నారు. దళిత బందు ఇప్పిస్తా అని సీతక్క కుమారుడు సూర్య‌ కాంగ్రెస్ వార్డ్ మెంబర్ అంకేశ్వరపు దయాకర్ నుంచి రూ. 3 లక్షలు వసూలు చేసి మోసం చేసాడు. ములుగు అంబేద్కర్ చౌరస్తా దగ్గర త‌న నుంచి డ‌బ్బు తీసుకున్న‌ట్లు అత‌ను చెప్తున్నాడు. త‌న‌కు న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగాడు. ఎన్నిక‌ల స‌మ‌యంలో సీత‌క్క ఈ వివాదంలో చిక్కుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.