Muhammad Yunus: భార‌త్‌లో ఉన్నంత‌వ‌ర‌కు మూసుకుని ఉండు

Muhammad Yunus asks sheikh hasina to keep quiet in india

Muhammad Yunus: బంగ్లాదేశ్ మాజీ ప్ర‌ధాని షేక్ హ‌సీనా ఇంకా భార‌త్‌లోనే త‌ల‌దాచుకున్న సంగ‌తి తెలిసిందే. బంగ్లాదేశ్ అల్ల‌ర్ల నేప‌థ్యంలో ఆమె నెల రోజుల క్రితం భార‌త్‌కు వ‌చ్చారు. యూకేకు పారిపోవాల‌ని అనుకున్నా అక్క‌డి ప్ర‌భుత్వం ఇంకా అనుమ‌తులు ఇవ్వ‌లేదు. దాంతో ఆమె ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత మ‌హ్మ‌ద్ యూన‌స్ హ‌సీనాకు వార్నింగ్ ఇచ్చారు. భార‌త‌దేశంలో ఉంటూ రాజ‌కీయ వ్యాఖ్య‌లు చేస్తోంద‌ని బంగ్లాదేశ్‌కు వ‌చ్చేంత వ‌ర‌కు భార‌త్‌లో అన్నీ మూసుకుని ఉంటే బాగుంటుంద‌ని అన్నారు.

భార‌త ప్ర‌భుత్వం హ‌సీనాను ఢిల్లీలోనే ఉండ‌నివ్వాలంటే ఆమె తిరిగి బంగ్లాదేశ్ వ‌చ్చేవ‌ర‌కు నోరు మూసుకుని ఉండాల‌ని అన్నారు. ఆమె భార‌త్‌లో ఉండి చేస్తున్న వ్యాఖ్య‌లు అటు బంగ్లాదేశ్‌కు ఇటు భార‌త్‌కు చేటు చేసేలా ఉన్నాయ‌ని హెచ్చ‌రించారు. బంగ్లాదేశ్ ప్ర‌జ‌ల‌కు ప్ర‌శాంత‌త కావాల‌ని ఇందుకోసం హ‌సీనా బంగ్లాదేశ్‌కు వ‌చ్చి త‌న‌పై ఉన్న కేసుల‌ను న్యాయ‌ప‌రంగా ఎదుర్కోవాల్సిందే అని అన్నారు. ఇప్ప‌టికీ బంగ్లాదేశ్‌ను హ‌సీనానే కాపాడ‌గ‌ల‌దు అని భార‌త్ భ్ర‌మలో ఉంటోంద‌ని.. బంగ్లాదేశ్‌లో ఉన్న అన్ని పార్టీలు మంచివే అని.. ఒక్క హ‌సీనా పార్టీ మాత్ర‌మే ఇస్లామిస్ట్ పార్టీ అని ఆరోపించారు.