Navneet Kaur: బండారు.. నీకు సిగ్గు అనేది ఉందా?
ఎంపీ నవనీత్ కౌర్ (navneet kaur) TDP మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తిపై (bandaru satynarayana murthy) ఆగ్రహం వ్యక్తం చేసారు. కొన్ని రోజుల క్రితం YSRCP మంత్రి రోజాపై (roja) అసభ్యకర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నవనీత్ స్పందించారు. “” బండారు.. మీరు ఒక పార్టీకి చెందిన సీనియర్ నేత. మీకు ఎంత ధైర్యం ఉంటే ఒక మహిళా మంత్రిని పట్టుకుని అలాంటి మాటలు అంటారు. మీ ఇంట్లో భార్య, పిల్లలు లేరా? నేను ఎంపీగా పార్లమెంట్‌లో ఏపీ, తెలంగాణకు చెందిన మంత్రుల పక్కన కూర్చుంటాను. తెలుగు మాట్లాడుతుంది మన అమ్మాయి అని నాకు ఎంతో రెస్పెక్ట్ ఇస్తారు. అలాంటిది మీరు మహిళా మంత్రి గురించి ఇంత నీచంగా మాట్లాడటానికి సిగ్గు లేదా? మీ దగ్గర ఆధారాలు ఉంటే అవి బయటపెట్టి మాట్లాడాలి కానీ.. ఇలా ఎవరైనా చేస్తారా? రోజా.. మీకు మేమంతా అండగా ఉన్నాం “” అని వీడియో రిలీజ్ చేసారు. (navneet kaur)