Pulwama attack: లోపం మనదే.. మోదీ నా నోరు నొక్కేసారు
Delhi: 2019 ఫిబ్రవరి 14న భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేని ఘటన చోటుచేసుకుంది. జమ్మూ కశ్మీర్‌లోని(jammu & kashmir) పుల్వామా(pulwama) ప్రదేశంలో ఉగ్రవాదుల ఘాతుకానికి పాల్పడ్డారు. అయితే ఈ దాడి జరిగేలా సూచనలు కనిపిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ(modi)కి సమాచారం అందిందట. కానీ ఆయన తన నోరు నొక్కేసారని షాకింగ్ విషయాలు వెల్లడించారు జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్(satyapal malik).
మోదీ మౌనమే పుల్వామా దాడికి కారణమైందని అన్నారు. అంతేకాదు చాలా మంది అనుకుంటున్నట్లు మోదీకి అవినీతిపై అంత ద్వేషమేమీ లేదని, అన్నీ తెలిసి కూడా ఏమీ సమాచారం లేనట్లే ఉంటారని అన్నారు.
“భద్రత కారణాల వల్ల ఎక్కువ మంది CRPF జవాన్లు ఒకేసారి కలిసి వాహనాల్లో ప్రయాణించే అవకాశం ఉండదు. అందుకే ఐదు ఎయిర్‌క్రాఫ్ట్‌లు కావాలని జవాన్లు కేంద్రాన్ని కోరారు. ఇందుకు కేంద్రం ఒప్పుకోలేదు. దాంతో జవాన్లు రోడ్డు మార్గానే ప్రయాణించాల్సి వచ్చింది. అలా ఉగ్రవాదులు గురిచూసి వారిపై దాడి చేసారు అని సత్యపాల్ షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఈ దాడి జరిగిన తర్వాత నాకు ప్రధాని ఫోన్ చేసారు. మనం ఎయిర్‌క్రాఫ్ట్‌లు పంపించి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదని చెప్పాను”
“అయితే ఇప్పుడు నువ్వేం మాట్లాడకు మౌనంగా ఉండు అన్నారు. ఈ దాడికి కారణం పాకిస్థానే అని చెప్పాలనుకుంటున్నారని మన తప్పు ఉందని మాత్రం ఒప్పుకోవడం లేదని అర్థమైంది. అంతేకాదు.. 300 కిలోల RDX ఉన్న ట్రక్కుతో జవాన్ల వ్యాన్ ఢీకొనడంతో 40 మంది జవాన్లు వీరమరణం పొందారు. అంత భారీ RDXను ఎటాక్‌కి ఒక రోజు ముందు జమ్మూకి తీసుకురావడం కుదరదు. ఒక 20 రోజులు ముందే ప్లాన్ చేసి RDXట్రక్కును ఉగ్రవాదులు తీసుకొచ్చిపెట్టారు” అని వెల్లడించారు మాలిక్. దీనిపై ప్రధాని కానీ ఇతర బీజేపీ నేతలు కానీ స్పందించలేదు.