BRICS Summit: ఓహో.. జెండాను తొక్కకూడదా..?!
ఎంతైనా భారతదేశ జాతీయ జెండాపై మనకున్న గౌరవం, అభిమానం ఇతర దేశాలకు లేవనే చెప్పాలి. ఏదో వాళ్ల దేశానికి సంబంధించిన ముఖ్యమైన రోజుల్లో తప్ప మిగతా రోజుల్లో కనీసం పట్టించుకోరేమోనని పైనున్న ఫొటోను చూస్తే అర్థమవుతుంది. అసలు ఏం జరిగిందంటే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (narendra modi) బ్రిక్స్ సమిట్‌లో (brics summit) భాగంగా సౌత్ ఆఫ్రికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. మోదీని రిసీవ్ చేసుకున్న ఆ దేశ అధ్యక్షుడు రమాఫోసా (ramaphosa).. మోదీతో కలిసి స్టేజ్ ఎక్కుతుండగా.. అక్కడ ఇరు దేశాల జాతీయ జెండా ఫొటోలు పడి ఉన్నాయి. మోదీ వంగి ఆ ఫొటోను పట్టుకుని జేబులో పెట్టుకున్నారు. అప్పటికే తమ దేశ జాతీయ జెండాను కాలితో తొక్కేసిన రమాఫోసా.. మోదీని చూసి ఓహో తొక్కకూడదా అనుకుని ఆయన కూడా వంగి ఫొటోను తీసి అక్కడున్న వ్యక్తికి ఇచ్చేసారు. మీరు కూడా మీ జెండాను ఇవ్వండి అని ఆ వ్యక్తి అడగ్గా.. వద్దులే నా జేబులో ఉంచుకుంటాను అని మోదీ అన్నారు.